"కణం" సినిమా రివ్యూ

తెలుగులో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సాయి పల్లవి ‘ఛలో ‘ తో సూపర్ హిట్ అందుకున్న నాగ శౌర్య జంటగా తెరకెక్కిన ‘కణం’ ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. A.L విజయ్ డైరెక్షన్ లో  ఎమోషనల్ హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన  ఈ సినిమా ఆడియన్స్ ను ఎలా ఎంటర్టైన్ చేసిందో తెలుసుకుందాం.

Last Updated : Apr 28, 2018, 12:37 AM IST
"కణం" సినిమా రివ్యూ

నటీ నటులు :  నాగశౌర్య, సాయి పల్లవి, బేబీ  విరోనికా, ప్రియదర్సి తదితరులు

మ్యూజిక్ : సి.శామ్

సినిమాటోగ్రఫీ : నిరవ్ షా

సమర్పణ: ఎన్‌.వి.ఆర్‌. సినిమా

నిర్మాణం :లైకా ప్రొడక్షన్స్

కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : A.L విజయ్

రిలీజ్ డేట్ : 27 ఏప్రిల్  2018

తెలుగులో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సాయి పల్లవి ‘ఛలో ‘ తో సూపర్ హిట్ అందుకున్న నాగ శౌర్య జంటగా తెరకెక్కిన ‘కణం’ ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. A.L విజయ్ డైరెక్షన్ లో  ఎమోషనల్ హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన  ఈ సినిమా ఆడియన్స్ ను ఎలా ఎంటర్టైన్ చేసిందో తెలుసుకుందాం.

కథ :
కృష్ణ (నాగ శౌర్య), తులసి (సాయి పల్లవి) టీనేజ్ లో ప్రేమించుకొని పెద్దలు ఐదేళ్ళు గడిచాక పెళ్లి చేస్తాం అని చెప్పడంతో విడిపోయి సెటిల్ అయ్యాక పెళ్ళిచేసుకొని దంపతులుగా మారతారు. అయితే టీనేజ్ లో ఇద్దరూ కలిసి చేసిన ఓ తప్పు ను కప్పిపుచ్చడానికి వీరి కుటుంబాలు తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అందరూ వరుసగా మృత్యువాత పడతారు. ఇంతకీ కృష్ణ – తులసి చేసిన తప్పేంటి… ఆ ఐదేళ్ళ తర్వాత వీరి జీవితం ఎలా సాగింది. పెళ్లి తర్వాత వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి.. అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు : 
పెద్దగా పెర్ఫాం చేసే స్కోప్ లేనప్పటికీ తన నటనతో ఆకట్టుకుని సినిమాకు హైలైట్ గా నిలిచింది సాయి పల్లవి. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో సాయి పల్లవి ఎక్స్ ప్రేషన్స్  బాగా ఆకట్టుకుంటాయి.  నాగ శౌర్య తన క్యారెక్టర్ కి  బెస్ట్ అనిపించుకున్నాడు. బేబీ విరోనికా తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచింది.   ఫస్ట్ హాఫ్ లో కామెడి తో నవ్వించి సెకండ్ హాఫ్ లో సీరియస్ యాక్టింగ్ తో సినిమాకు ప్లస్ అయ్యాడు ప్రియదర్శి . కేవలం కామెడీ మాత్రమే కాకుండా సీరియస్ రోల్స్ కూడా చేయగలడని ఈ సినిమాతో  నిరూపించుకున్నాడు. ఇక గందారి నితిన్, సంతాన భారతి, రేఖ , రవి, స్టంట్ సిల్వ మిగతా నటీ నటులంతా తమ క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నారు.

 

 

టెక్నిషియన్స్ పనితీరు : 
ఇలాంటి ఎమోషనల్ థ్రిల్లర్ సినిమాలకు బాగ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యమో తెలిసిందే… సామ్ సీ.ఎస్ అందించిన సాంగ్స్ తో పాటు  బాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచింది . తన బాగ్రౌండ్ స్కోర్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు సామ్. కృష్ణ మద్దినేని అందించిన సాహిత్యం బాగుంది. ముఖ్యంగా ‘జో లాలి జో’,’సంజాలి’ సాంగ్స్ బాగున్నాయి. అలాగే నిరవ్ షా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో హైలైట్. ఇప్పటికే కెమెరామెన్ గా మంచి గుర్తింపు అందుకున్న నిరావ్ షా కొన్ని సీన్స్ లో తన ప్రతిభ చూపించాడు. ఎడిటింగ్ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. లైకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.  దర్శకుడు విజయ్ ఎంచుకున్న పాయింట్ బాగుంది.

సమీక్ష  : 
నిజానికి ఎమోషనల్ థ్రిల్లర్ సినిమాను డీల్ చేయడం కొంచెం కష్టమే… ఈ జోనర్ సినిమా అంటేనే…  ఎమోషన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే  మరో వైపు థ్రిల్ చేయగలగాలి. గతంలో నాన్న వంటి ఎమోషనల్ డ్రామాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న దర్శకుడు విజయ్ ఈసారి కూడా అలాంటి ఎమోషన్ కథంశాన్నే ఎంచుకున్నాడు. కానీ ఆ ఎమోషన్ తో పూర్తి స్థాయిలో మెస్మరైజ్ చేయలేకపోయాడు.

బ్రూణ హత్యలపై తను చెప్పాలనుకున్న పాయింట్ ను డ్రాగ్ చెయ్యకుండా స్ట్రైట్ గా చెప్పడంలో దర్శకుడిగా విజయ్ సక్సెస్ అయ్యాడు.  కాకపోతే అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు. కథను ముందే రివీల్ చేసేయడంతో  సినిమా ప్రేక్షకుడికి  ఆసక్తికరంగా అనిపించదు. కానీ కొన్ని సీన్స్ తో పరవాలేదనిపించాడు విజయ్.

ముఖ్యంగా పర్ఫెక్ట్ కాస్టింగ్ ను సెలెక్ట్ చేసుకొని క్యారెక్టర్స్ తో కొంత వరకూ ఎంటర్ టైన్ చేయగలిగాడు.  ఎమోషన్ పండించడంలో దిట్టైన విజయ్ ఈసారి మాత్రం  ఎమోషన్ మీద కాన్సంట్రేషన్ తగ్గించి రివెంజ్ సీన్స్ మీద దృష్టి పెట్టడంతో కొన్ని సీన్స్  మినహా మిగతా సీన్స్ లో ఎమోషన్ పండలేదు.బ్రూణ హత్యల గురించి దర్శకుడు ఎంచుకున్న కథ బాగుంది కానీ దాన్ని మరింత ఎంగేజింగ్ గా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. దియా రివేంజ్ తీర్చుకునే సీన్స్,  ఇంటర్వెల్ సీన్ ,  క్లైమాక్స్ కి ముందు వచ్చే  ప్రీ క్లైమాక్స్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా మహిళలకు బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ఇది.

ప్లస్ పాయింట్స్ : 
సాయి పల్లవి
నాగ శౌర్య
బేబీ విరోనికా
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
ఇంటర్వెల్ సీన్
ప్రీ క్లైమాక్స్
కొన్ని ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ 
స్టార్టింగ్ లోనే కథను రివీల్ చేయడం
స్క్రీన్ ప్లే
నెరేషన్
డైరెక్షన్
ఎమోషన్ పండకపోవడం

 

ఫైనల్ గా ‘కణం’ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఆలోచింపజేసే సినిమా.
రేటింగ్ : 2.5/5

(జీ సినిమాలు సమీక్ష)

 

Trending News