Surya Gochar effect on Pisces: మరో రెండు రోజుల్లో సూర్యభగవానుడు తన రాశిని మార్చబోతున్నాడు. జూలై 16న సూర్యుడు కర్కాటకరాశిలోకి (Sun Transit in Cancer) ప్రవేశిస్తాడు. కర్కాటకరాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు ఇంట్లో సూర్యుడి ప్రవేశం మెుత్తం 12 రాశులపై పెను ప్రభావం చూపుతుంది. అయితే మీనరాశిలపై సూర్యుడు ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
కర్కాటకరాశిలో సూర్యుడు సంచారం వల్ల మీనరాశి వారు ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. పనిని ఎప్పుడూ మధ్యలో వదిలేయకండి. ఈ రాశివారు మానసికంగా దృఢంగా ఉండటానికి మెడిటేషన్ చేయండి. యువకులైతే జిమ్ లో చేరవచ్చు. వ్యాపారం నష్టపోకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న తర్వాత మాత్రమే బిజినెస్ చేయాలి. లేకపోతే మీరు భారీగా నష్టపోవచ్చు. ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
ప్రయాణం చేసేటప్పుడు పక్కా ప్లాన్ చేసుకుని మాత్రమే వెళ్లాలి. అవసరం ఉంటే ప్రయాణాలు చేయండి లేకపోతే ప్రమాదానికి గురికావచ్చు. మరి స్పీడ్ గా వెళ్లకండి. ప్రభుత్వ అధికారులతో చాలా మర్యాదగా మాట్లాడండి మరియు అకస్మాత్తుగా ఏదైనా విషయంపై చర్చ జరిగే పరిస్థితి ఏర్పడితే, దానిని నివారించడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
Also Read: Sravana Masam 2022: శ్రావణ మాసంలో ఈ చిన్న వస్తువులను కొనండి... అపారమైన డబ్బును పొందండి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook