Singapore Open 2022 Final: సింగ‌పూర్ ఓపెన్ ఫైన‌ల్‌కు పీవీ సింధు.. తొలి సూపర్‌ 500 టైటిల్‌పై కన్ను!

PV Sindhu Reaches Singapore Open 2022 Final. సింగపూర్‌ ఓపెన్‌ 2022 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు దూసుకుపోతోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 16, 2022, 02:51 PM IST
  • సింగ‌పూర్ ఓపెన్ ఫైన‌ల్‌కు పీవీ సింధు
  • వరుస సెట్లలో విజయం
  • తొలి సూపర్‌ 500 టైటిల్‌పై కన్ను
Singapore Open 2022 Final: సింగ‌పూర్ ఓపెన్ ఫైన‌ల్‌కు పీవీ సింధు.. తొలి సూపర్‌ 500 టైటిల్‌పై కన్ను!

PV Sindhu Reaches Singapore Open 2022 Final: సింగపూర్‌ ఓపెన్‌ 2022 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు దూసుకుపోతోంది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ఫామ్ కనబర్చుతున్న సింధు.. ఫైన‌ల్‌లోకి అడుగుపెట్టింది. శనివారం (జులై 16) జరిగిన సెమీ ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి సయినా కవకామిపై 21-15, 21-7 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్ అర్హత సాధించింది. 32 నిమిషాల పాటు సాగిన సెమీస్‌లో సింధు ఆధిపత్యం కొనసాగింది. 

సింగపూర్‌ ఓపెన్‌ 2022 సెమీ ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు రెండు గేమ్‌లలో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఎక్కడా కూడా ప్రత్యర్థి సయినా కవకామికు అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌ ఆది నుంచే తప్పులు చేసిన సయేనా.. తొలి రౌండ్‌లో మాత్రం కాస్త పోరాడగలిగింది. దీంతో సింధు 21-15తో మొదటి రౌండ్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో రౌండ్‌లో సింధు ఫోర్‌హ్యాండ్ అటాకింగ్ రిట‌ర్న్స్‌, బ్యాక్‌హ్యాండ్ ఫ్లిక్స్‌ ధాటికి చేతులెత్తేసింది. దాంతో 21-7 తేడాతో రెండో రౌండ్‌తో పాటు మ్యాచును గెలుచుకుంది. 

ఈ మ్యాచ్‌కు ముందు వరకు పీవీ సింధు, సయినా కవకామి రెండుసార్లు తలపడగా.. తెలుగు తేజంనే విజయాలు వరించాయి. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ నమోదు చేసింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో ర్యాంక్‌లో ఉన్న పీవీ సింధు.. మరో సెమీస్‌ విజేతతో ఆదివారం ఫైనల్‌లో తలపడనుంది. కెరీర్‌లో దాదాపు అన్ని సూపర్‌ 500 టైటిల్స్‌ సాధించిన సింధు.. సింగపూర్‌ ఓపెన్‌ మాత్రం గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఈ టైటిల్‌ గెలవాలని చూస్తోంది.

Also Read: Oppo A97 5G Price: రూ.23 వేలకే ఒప్పో కొత్త 5జీ ఫోన్.. సూపర్ స్పెసిఫికేషన్‌లు ఇవే!
Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోసారి రెయిన్ అలర్ట్..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News