Funny video: గేదె ముందు బాలిక డ్యాన్స్.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్..

Funny video: ఓ అమ్మాయి గేదెకు మేత తినిపిస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసి జనాలు విపరీతంగా నవ్వుకుంటున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2022, 04:13 PM IST
Funny video: గేదె ముందు బాలిక డ్యాన్స్.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్..

Funny video: సోషల్ మీడియోలో (Social Media) రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ మధ్య ఇంటర్నెట్ లో ఏదైనా చిన్నది వెరైటీగా చేస్తే చాలు ఇట్టే వైరల్ అయిపోతుంది. ఓ అమ్మాయి గేదెకు మేత తినిపిస్తున్న వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. అంతగా నవ్వడానికి ఈ వీడియోలో ఏముందో అని అనుకుంటున్నారా.. మీరు ఓ లుక్కేయండి మరి. 

వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఓ అమ్మాయికి గేదెకు మేత వేయిడానికి వస్తుంది. గడ్డిని తినిపిస్తుంది.  ఆనందంతో ఆ బాలిక డ్యాన్స్ వేస్తుంది. కానీ గేదెకు అది నచ్చదు. దీంతో ఆ అమ్మయిని ఒక తోపు తోస్తుంది. అంతే బాలిక కింద పడిపోయి లేవలేకపోతుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు. అంతేకాక తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. Psycho bihari అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో (Funny Video) షేర్  చేయబడింది. ఈ వీడియోపై లైక్స్ వర్షం కురుస్తుంది. 

Also Read: Groom Kissed Video: మండపంలో అందరిముందే వధువుకి ముద్దుపెట్టిన వరుడు.. సిగ్గుతో ఏం చేశాడో చూడండి!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News