Amazon Offers: రూ.15 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ డెడ్‌ చీప్‌గా రూ.999కే.. ఆఫర్ ఈ ఒక్కరోజే

Amazon Deal Of The Day: తక్కువ ధరలో మంచి ఫీచర్స్‌ కలిగిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే అమెజాన్‌లో మీకోసం డీల్ ఆఫ్ ది డే పేరిట పలు స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 19, 2022, 04:43 PM IST
  • అమెజాన్ లేటెస్ట్ ఆఫర్స్
  • డీల్ ఆఫ్ ది డేలో పలు స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు
  • టెక్నో పొవా 3 స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్
Amazon Offers: రూ.15 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ డెడ్‌ చీప్‌గా రూ.999కే.. ఆఫర్ ఈ ఒక్కరోజే

Amazon Deal Of The Day: ప్రముఖ ఈకామర్స్ సైట్ అమెజాన్ 'డీల్ ఆఫ్ ది డే' పేరిట పలు స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ (జూలై 19) డీల్ ఆఫ్ ది డే ఆఫర్‌లో 'టెక్నో పొవా 3' స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. 20 శాతం డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా దాదాపుగా 90 శాతం తగ్గింపు పొందవచ్చు. అంటే.. డెడ్ చీప్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్‌లో 20 శాతం డిస్కౌంట్ :

టెక్నో పొవా 3 (ఇకో బ్లాక్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్ లాంచింగ్ ధర రూ.14,999. కానీ అమెజాన్ డీల్ ఆఫ్ ది డే ఆఫర్‌లో దీనిపై 20 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. డిస్కౌంట్ పోను రూ.11,999కే ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. అంటే.. రూ.3 వేల వరకు ఆదా అవుతుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ :

టెక్నో పొవా 3 (ఇకో బ్లాక్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్‌పై డీల్ ఆఫ్ ది డే ఆఫర్‌లో ఎక్స్‌చేంజ్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ.11 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఒకవేళ పూర్తి తగ్గింపు లభించినట్లయితే రూ.11,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ని డెడ్ చీప్‌గా రూ.999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే. కాబట్టి చౌక ధరకే ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఇవాళే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 

Also Read: TS EAMCET-2022: ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన..ఎంసెట్ అగ్రికల్చర్ రీషెడ్యూల్ ఇదే..!

Also Read: TS EAMCET-2022: ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన..ఎంసెట్ అగ్రికల్చర్ రీషెడ్యూల్ ఇదే..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News