International Chess Day 2022 Significance: అంతర్జాతీయ చెస్ సమాఖ్య ( FIDE ) 20 జూలై 1924 న స్థాపించబడింది. ఈ క్రమంలోనే జూలై 20ని అంతర్జాతీయ చదరంగ దినోత్సవంగా జరుపుకోవాలనే యునెస్కో సూచనలతో అప్పటి నుంచి ఈరోజునే అంతర్జాతీయ చదరంగ దినోత్సవం జరుపుకుంటున్నారు. నిజానికి 1966లో జూలై 20న మొదటి అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు చదరంగ ప్రియులు. ఈ రోజు అంతర్జాతీయ చదరంగ దినోత్సవం సంధర్భంగా చాలా చోట్ల చదరంగం పోటీలు నిర్వహిస్తారు. చదరంగం ఆడాలంటే మెదడుకు పని పెట్టాల్సిందే.
ఇద్దరు ఆడే ఈ ఆటలో ప్రత్యర్ధి ఎత్తులను పై ఎత్తులను ముందే ఊహించి ఆడాల్సి ఉంటుంది. మన ఎత్తు మనం వేయడమే కాక మన ప్రత్యర్ధి ఎత్తులను కూడా ముందే ఊహించాల్సి రావడం వలన ఇది మానసిక శ్రమ అవసరమయ్యే ఆట అని చెప్పచ్చు. అందుకే దీన్ని మైండ్ గేమ్ అని కూడా అంటారు. దీన్ని ఆడడం వలన మీ మైండ్ చాలా షార్ప్ అవుతుందని నమ్ముతారు. నిజానికి ఈరోజుల్లో పిల్లలు ఇలాంటి మానసికోల్లాసం కల్పించే ఆటలు కాకుండా వీడియో గేమ్‌లలో నిమగ్నమై ఉంటున్నారు.
ఈ క్రమంలో ఆ వీడియో గేమ్స్ వారి కంటి చూపును కూడా ప్రభావితం చేస్తున్నాయి. వారి మైండ్ పై కూడా నెగటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే వాటికి బదులుగా మీరు మీ పిల్లలను చెస్ వంటి ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. నిజానికి ఈ చెస్ అనేది ఆరోగ్యకరమైన మైండ్ గేమ్స్ లో మొదటి స్థానంలో నిలబడుతుంది. ఈ ఆట ఆడడం వలన వల్ల మెదడు సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ ఆట ఆడేవారికి కొత్త ఆలోచనలను సృష్టించే సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ గేమ్‌కి సమయ పరిమితి లేదు, కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఓర్పుతో నిర్ణయాలు తీసుకోవడాన్ని సహా సహనం వంటి లక్షణాలను కూడా నేర్పుతుంది.
అంతేకాక ఈ చెస్ ఆట పిల్లల నేర్చుకునే శక్తి, జ్ఞాపకశక్తి అలాగే దృష్టిని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ సామర్థ్యాలను పెంపొందించుకోవడం ద్వారా, వారి మనస్సు ఏ రంగంలోనైనా మెరుగ్గా పని చేయడం నేర్చుకుంటారు. మొబైల్ లేదా ఏదైనా గ్యాడ్జెట్‌తో ఇలాంటి గేమ్‌లు ఆడటం మంచిది కాదని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలా ఆడలు అనుకుంటే కనుక అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అలాగే, చదరంగం లేదా మరేదైనా మైండ్ గేమ్ కూడా మీ మైండ్ కు ఉన్న ఏ విధమైన సమస్యలకు నివారణ కాదు. ఈ ఆటలు మీరు సరదాగా ఆడగల ఆరోగ్యకరమైన మైండ్ గేమ్స్ మాత్రమే.
Also Read: Drones in Agriculture: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... త్వరలో రైతులకు డ్రోన్లు..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook