బెంగుళూరులో ఓ ట్రాఫిక్ పోలీస్ అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. ఇటీవలే హెల్మెట్ లేకుండా రోడ్డు మీద బైక్ నడుపుతున్న యువకులకు కారణం చెప్పి మాట్లాడాల్సింది పోయి.. వారి మీద బూటు విసిరాడు. అయితే అనుకోకుండా అటువైపు వెళ్తున్న ఓ యూట్యూబర్ రోడ్డును వీడియోని తీస్తుండగా.. ఈ సంఘటన కూడా అందులో రికార్డైంది.
ఇంకేముంది...ఆ కుర్రాడు ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టడంతో అది వైరల్ అయిపోయింది. నెటిజన్లు వెంటనే రియాక్టయి సదరు ట్రాఫిక్ పోలీస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకేముంది... క్షణికావేశంలో పొగరుతో చేసిన పనికి ఆ ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం ఊడింది. అయితే ఇదే వీడియోపై మిశ్రమ స్పందనలు వచ్చాయి.
కొందరు పోలీస్ చేసిన పని కరెక్టేనని సమర్థిస్తే.. పోలీసు కూడా చట్టవ్యతిరేకంగా నడుచుకున్నాడు కాబట్టి తనకు శిక్ష పడాల్సిందేనని పలువురు నెటిజన్లు డిమాండ్ చేశారు
ఈ క్రింది వీడియోలో 6 నిమిషాల 50 సెకండ్ల వద్ద చూస్తే.. పోలీస్ బూటు విసిరిన వీడియో క్లిప్ కనిపిస్తుంది