How To Set Paytm Reminders: చెల్లింపులు ఆలస్యమయ్యాయా ? Paytm రిమైండర్‌లు మీ కోసమే!

Paytm Reminders Uses: భారతదేశంలో 350 మిలియన్లకు పైగా ప్రజలు ఆన్‌లైన్ లావాదేవీలు చేయడానికి Paytm పై విశ్వాసం చూపిస్తున్నారు. నగదు చెల్లింపులు, బ్యాంక్ బదిలీలతో సహా అనేక ఇతర లావాదేవీలు ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా పేటీఎం ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2022, 10:18 AM IST
  • Paytm రిమైండర్స్ రూపంలో మీ కొత్త వర్చువల్ సెక్రటరీకి హలో చెప్పండి
  • బిల్లులు చెల్లింపు, మొబైల్, డీటీహెచ్ రీచార్జుల విషయంలో ఇక టెన్షన్ అక్కర్లేదు
  • గడువు తేదీని గుర్తుంచుకోవాలనే టెన్షన్‌కి ఇక గుడ్‌బై చెప్పండి
How To Set Paytm Reminders: చెల్లింపులు ఆలస్యమయ్యాయా ? Paytm రిమైండర్‌లు మీ కోసమే!

Paytm Reminders Uses: భారతదేశంలో 350 మిలియన్లకు పైగా ప్రజలు ఆన్‌లైన్ లావాదేవీలు చేయడానికి Paytm పై విశ్వాసం చూపిస్తున్నారు. నగదు చెల్లింపులు, బ్యాంక్ బదిలీలతో సహా అనేక ఇతర లావాదేవీలు ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా పేటీఎం ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. సులభమైన చెల్లింపులు, మల్టిపుల్ రీఛార్జ్ ఎంపికలు, ఉత్తేజకరమైన ఆఫర్‌లు మరియు అనేక ఇతర ఫీచర్‌ల కారణంగా Paytm దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పేమెంట్స్ పార్టనర్‌గా మారిందంటే అది అతిశయోక్తి కాదు. సరే, Paytm చెల్లింపులను సులభతరం చేసిందని మాకు తెలుసు. అయితే మీరు చెల్లింపులు చేయాలని గుర్తుంచుకోకపోతే అప్పుడేమవుతుందో ఊహించారా ? ఉదాహరణకు, మీరు కరెంట్ బిల్లును గడువు తేదీలోగా చెల్లించడం మర్చిపోయారు. లేదా మీరు గ్యాస్ బిల్లును చెల్లించాలనే విషయం మరచిపోవడం వల్ల మీ గ్యాస్ స్టవ్ వెలగడం లేదని గుర్తొచ్చినప్పుడు మీ పరిస్థితేంటి ? అవును, మీరు ఆలస్యంగా చెల్లింపులు చేయవచ్చు, కాకపోతే.. అది మీ పరపతిపై, మీ ఆర్థిక ప్రయోజనాలపై దుష్ర్పభావం చూపిస్తుంది. అలాంటి పరిస్థితే కానీ ఎదురైతే.. ఆ తర్వాత అనేక చిక్కులు, ఫార్మాలిటీలు కూడా ఉంటాయనే విషయం మర్చిపోవద్దు.

సరిగ్గా అలాంటి సమస్యలను అధిగమించడానికే రిమైండర్స్ పేరుతో Paytm మరొక సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. Paytm రిమైండర్‌లు చెల్లింపులు గడువు ముగిసే సమయంలో ఆయా బిల్లులను చెల్లించాల్సిందిగా సూచిస్తూ మీకు గుర్తుచేస్తాయి. ఉదాహరణకు, మీ మొబైల్ ప్యాక్ గడువు ముగిసేలోపు రీఛార్జ్ చేయాలని లేదా ఫలానా రోజున లేదా మీరు చేయాల్సిన ఇతర సాధారణ చెల్లింపులూ, ఇంకా మీ వంటమనిషి జీతమూ చెల్లించాలని అది మీకు గుర్తు చేస్తుంది.

వినియోగదారులు Paytm రిమైండర్‌లను ముఖ్యంగా ప్రతి నెలా వారి వ్యాలిడిటీ ప్యాక్‌ని రీఛార్జ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. కేవలం 3 క్లిక్‌లలో రీఛార్జ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది చాలా సులభం. వినియోగదారులకు నోటిఫికేషన్‌లు & SMS ద్వారా రిమైండర్‌లు వెళ్తాయి.

ఇది విషయాల్ని ఎంతో తేలిగ్గా చేసిపెడుతోంది కదా ? అయితే Paytmలో రిమైండర్‌లను ఎలా సెటప్ చేయాలి? Paytm ఇన్-బిల్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇక్కడ వినియోగదారులు యాప్‌లో రీఛార్జ్ లావాదేవీని పూర్తి చేసిన తర్వాత వారి రీఛార్జ్ గురించి నోటిఫికేషన్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం అందుతుంది. రిమైండర్స్ గురించి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. మీ మునుపటి రీఛార్జ్ ఆధారంగా, ఆ తర్వాత రాబోయే తదుపరి రీఛార్జ్ గురించి Paytm మీకు ముందే గుర్తుచేస్తుందన్నమాట. వాస్తవానికి, మీ మొబైల్ నంబర్ ఆధారంగా, Paytm ఆటోమేటిక్‌గా ఆపరేటర్‌ను కూడా గుర్తించగలదు. మీరు మునుపటి లావాదేవీని కూడా రిపీట్ చేయవచ్చు.

అంతే కాకుండా, మీరు రిమైండర్‌లను మాన్యువల్‌గా కూడా సెటప్ చేయవచ్చు. ఈ సాధారణ స్టెప్‌లను అనుసరించండి 
స్టెప్ 1: మీ Paytm యాప్‌ని ఓపెన్ చేసి ఎగువ ఎడమవైపు మూలలో ఉన్న మూడు అడ్డగీతలపై క్లిక్ చేయండి. మూడు అడ్డగీతలు లేదా బార్‌లు మోర్ ఆప్షన్స్‌ని సూచిస్తాయి.
స్టెప్ 2: పేమెంట్ సెట్టింగ్‌లను ఎంచుకున్న తర్వాత మీరు Paytm అసిస్ట్ & Paytm పోస్ట్‌పెయిడ్ క్రింద పేమెంట్ రిమైండర్స్ అనే ఆప్షన్ చూడవచ్చు. పేమెంట్ రిమైండర్‌లపై క్లిక్ చేయండి.
స్టెప్ 3: కొత్త పేమెంట్ రిమైండర్‌ని యాడ్ చేయడానికి పైన కుడి మూలలో ఉన్న +Add New అనే ఆప్షన్ ఎంచుకోండి.
స్టెప్ 4: ఆ తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్‌ని జోడించండి. మీ కాంటాక్ట్స్ నుండి వ్యక్తులను ఎంచుకునే అవకాశం కూడా మీకు ఉంది.
స్టెప్ 5: తర్వాత, మీరు చెల్లింపు చేయడానికి కారణాన్ని పేర్కొనాలి. ఈ చెల్లింపు దేనికి అనే విషయాన్ని నిర్ధారిస్తూ మీరు ఇప్పటికే ఉన్న ఆప్షన్స్ నుండి ఎంచుకోవచ్చు లేదా మరొక కారణాన్ని పేర్కొనవచ్చు.
స్టెప్ 6: మీరు చివరిగా చేయవలసినది ఏమిటంటే, మీరు చెల్లింపు చేయడానికి రిమైండ్ చేయాలనుకుంటున్న తేదీని కూడా స్పష్టంగా పేర్కొనడం. నిర్దిష్ట తేదీని ఎంచుకోవడానికి దిగువ ఛేంజి ఆప్షన్ మీద మేము మీకు ఎప్పుడు గుర్తు చేయాలి? అని క్లిక్ చేయండి.
స్టెప్ 7: మీరు అన్నింటినీ తనిఖీ చేసిన తర్వాత, సెట్ పేమెంట్ రిమైండర్‌‌పై క్లిక్ చేయండి.
ఇక అంతే! మీరు ఇలా చేస్తే చాలు. ఏవైనా పేమెంట్స్, రీచార్జుల గురించి మీకు గుర్తు లేకపోయినా.. గడువు తేదీ కంటే ముందే ఆ చెల్లింపులు చేయాల్సిందిగా మీకు గుర్తు చేయడానికి మీ Paytm సదా మీ సేవలో సిద్ధంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ పేటిఎం ఎకౌంట్లో మీరు కూడా రిమైండర్స్ సెట్ చేసుకోండి.. పేమెంట్స్, రీచార్జుల గురించి నిశ్చింతగా ఉండండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News