Uma Maheshwari Death: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మృతిపై పోస్టుమార్టమ్ రిపోర్ట్.. ఏం తేలిందంటే..

Uma Maheshwari Death: ఉమామహేశ్వరి అనుమానాస్పద మృతి కేసులో పోస్టుమార్టమ్ నివేదిక పోలీసులకు అందింది. పోస్టుమార్టమ్ నివేదికలో ఏం తేలిందంటే.. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 6, 2022, 10:22 AM IST
  • ఉమామహేశ్వరి అనుమానాస్పద మృతి
  • పోలీసులకు అందిన ఫోరెన్సిక్ పోస్టుమార్టమ్ రిపోర్ట్
  • ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడి
 Uma Maheshwari Death: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మృతిపై పోస్టుమార్టమ్ రిపోర్ట్.. ఏం తేలిందంటే..

Uma Maheshwari Death: దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (57) అనుమానాస్పద మృతిపై ఫోరెన్సిక్ పోస్టుమార్టమ్ రిపోర్ట్ వచ్చింది. ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్య నిపుణులు ఉమామహేశ్వరి పోస్టుమార్టమ్ రిపోర్ట్‌ను జూబ్లీహిల్స్ పోలీసులకు అందజేశారు. పోస్టుమార్ట్ రిపోర్ట్‌లో ఉమామహేశ్వరిది ఆత్మహత్యేనని వెల్లడైంది. మెడ చుట్టూ తాడు బిగించుకోవడం వల్ల స్వరపేటిక విరిగి ఆమె మృతి చెందినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. దీంతో ఉమామహేశ్వరి మరణంపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయినట్లయింది.

ఉమామహేశ్వరి ఇటీవల జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం వేళ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆమె బలవన్మరణం చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఉమామహేశ్వరి మరణంపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

ఉమామహేశ్వరికి భర్త కంఠమనేని శ్రీనివాస ప్రసాద్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె బేకరీ ఉత్పత్తుల వ్యాపారం చేస్తున్నారు. ఉమామహేశ్వరి బలవన్మరణం నందమూరి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అంత్యక్రియల సందర్భంగా సోదరుడు బాలకృష్ణ అన్నీ తానై వ్యవహరించారు. శ్మశానంలో సోదరి పాడె మోశారు. ఉమామహేశ్వరి అంత్యక్రియలకు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం పోస్టుమార్టమ్ నివేదిక ఆధారంగా ఉమామహేశ్వరి మృతిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Also Read: Vice President Poll Live Updates: జగదీప్ ధనకర్ వర్సెస్ మార్గరెట్ ఆల్వా.. భారత కొత్త ఉప రాష్ట్రపతి ఎవరో?

Also Read: TS SI Prelims Exam: రేపే ఎస్సై ప్రిలిమ్స్‌ ఎగ్జామ్.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Trending News