SSLV Rocket: ఆదిలోనే అవాంతరాలతో ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగం

SSLV Rocket: పూర్తిగా ఇస్రో అభివృద్ధి చేసి... తొలిసారి ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. ఈవోఎస్‌-02, ఆజాదీశాట్‌ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడమే లక్ష్యంగా ఆదివారం జరిగిన ఈ ప్రయోగం అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు.

  • Zee Media Bureau
  • Aug 8, 2022, 06:23 PM IST

SSLV Rocket: పూర్తిగా ఇస్రో అభివృద్ధి చేసి... తొలిసారి ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. ఈవోఎస్‌-02, ఆజాదీశాట్‌ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడమే లక్ష్యంగా ఆదివారం జరిగిన ఈ ప్రయోగం అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. ఆదివారం ఉదయం 9.18 గంటలకు తిరుపతి జిల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ (SSLV) నింగిలోకి దూసుకెళ్లింది. తొలి మూడు దశలు అనుకున్నట్లుగానే పూర్తయ్యాయి. కానీ, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే టెర్మనల్‌ దశలో సంబంధాలు తెగిపోయి సమాచారం లభ్యం కాలేదని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు.

Video ThumbnailPlay icon

Trending News