Acupressure Treatment: ఆక్యుప్రెజర్ ట్రిట్‌మెంట్ తో 10 నిమిషాల్లో ఒత్తిడికి చెక్!

Acupressure Points: ప్రస్తుతం చాలా మంది మలబద్ధకం వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.  ఏ చిన్న పని చేసిన అలసిపోతున్నారు. అయితే అనారోగ్యం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2022, 11:35 AM IST
  • ఆక్యుప్రెజర్ ప్రక్రియను రోజూ చేయడం వల్ల
  • ఒత్తిడిని నుంచి విశ్రాంతి కలుగుతుంది
  • అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది
Acupressure Treatment: ఆక్యుప్రెజర్ ట్రిట్‌మెంట్ తో 10 నిమిషాల్లో ఒత్తిడికి చెక్!

Acupressure Treatment: ప్రస్తుతం చాలా మంది మలబద్ధకం వంటి అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు.  ఏ చిన్న పని చేసిన అలసిపోతున్నారు. అయితే అనారోగ్యం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమస్యల వల్ల వైద్యులను సంప్రదిస్తే.. ఫాస్ట్ ఫుడ్‌ వంటి ఆహారాలను తీసుకోవద్దని చెబుతున్నారు. అయినప్పటికీ చాలా మంది వాటిని ఆహారంగా తీసుకుని.. బరువు పెరగడం, మలబద్ధకం వంటి సమస్యల బారినపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆక్యుప్రెజర్ ట్రిట్‌మెంట్ ద్వారా ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  ప్రెజర్ పాయింట్ల గురించి.. ప్రతిరోజూ వాటిని నొక్కడం వల్ల  అనారోగ్యకరమైన అలవాట్లు కోరికలను తగ్గించుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చేతుల వెనుక భాగంలో:
ఈ పాయింట్ చూపుడు వేలు, బొటనవేలుకు మధ్య ఉంటుంది. ప్రతిరోజూ కనీసం 30 సెకన్ల పాటు ఈ పాయింట్‌ను నొక్కడం వల్ల ఆకలి తగ్గడమే కాకుండా.. ఒత్తిడి, అలసట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మోకాలి పాయింట్:
మోకాలి టోపీ క్రింద 2 అంగుళాలు కింద ఆకలిని తగ్గించే పాయింట్ ఉంటుంది. ఈ బిందువును నొక్కడం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. తేలికపాటి చేతితో ఈ పాయింట్‌ను మసాజ్ చేసి.. ఆపై దానిని 2 నిమిషాలు నొక్కి పట్టుకోండి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

ఎల్బో పాయింట్:
మోచేతు లోపలి భాగంలోని కదలికల్లో బొటనవేలుతో మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల శరీరంలో పేగులు బాగా పని చేసి..శరీరం నుంచి అధిక వేడి తొలగిస్తుంది.

ఇయర్ పాయింట్:
బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఈ ప్రక్రియను రోజూ చేయాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇయర్ పాయింట్‌ను ప్రతిరోజూ 1 నిమిషం నొక్కండి. ఇలా చేయడం వల్ల.. ఆకలి నియంత్రిణలో ఉంటుంది.

యాంకిల్ పాయింట్:
ఈ పాయింట్ చీలమండపై 2 అంగుళాలు ఉంటుంది. ప్రతిరోజూ కనీసం 1 నిమిషం పాటు ఈ పాయింట్‌ను వేళ్లతో నొక్కడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు)

Also Read: PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు.

Also Read: క్యాబ్ డ్రైవర్‌పై 20 మంది దాడి.. కోమాలో బాధితుడు.. డబ్బులు ఇవ్వకపోగా స్నేహితులతో కలిసి దాడి చేసిన నిందితుడు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News