Pradeep Patwardhan: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు ప్రదీప్ హఠాన్మరణం!

Pradeep Patwardhan Passes Away: సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరాఠీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 9, 2022, 12:48 PM IST
  • సినీ పరిశ్రమలో విషాదం..
  • ప్రముఖ నటుడు ప్రదీప్ హఠాన్మరణం
  • సంతాపం తెలిపిన సీఎం షిండే
Pradeep Patwardhan: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు ప్రదీప్ హఠాన్మరణం!

Pradeep Patwardhan Passes Away: ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు అనారోగ్య కారణాలతో అలాగే అనేక ఇతర కారణాలతో మరించారు. ఇక తాజాగా మరాఠీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మరాఠీ సినీ నటుడు ప్రదీప్ పట్వర్ధన్ మంగళవారం నాడు 9 ఆగస్టు 2022న ముంబైలోని తన స్వగృహంలో ఆకస్మికంగా కన్నుమూశారు. ప్రదీప్ పట్వర్ధన్‌కు మంగళవారం ఉదయం గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.  

ప్రదీప్ పట్వర్ధన్‌ వయస్సు 64 సంవత్సరాలు. ప్రదీప్ పట్వర్ధన్ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు ఆయన నాటకరంగంలో కూడా చాలా ఫేమస్. ఆయన మరాఠీ నాటకం ‘మొరుచి మ్వాషి’ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. ఇక నాటకరంగంలో సత్తా చాటిన ఆయన అనేక మరాఠీ సినిమాలు సహా టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. ఇక ప్రదీప్ పట్వర్ధన్‌ మృతితో మరాఠీ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా పట్వర్ధన్‌ మృతికి సంతాపం వ్యక్తం చేసి సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు.

సిఎం షిండే మరాఠీలో 'ప్రదీప్ పట్వర్ధన్ ఎవర్ గ్రీన్ నటుడు, మరాఠీ సినిమాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు, ఆయన మరణం బాధాకరం. మరాఠీ కళారంగం ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రదీప్ పట్వర్ధన్ తన కెరీర్‌లో 'ఏక్ ఫుల్ చార్ హాఫ్', 'డ్యాన్స్ పార్టీ', 'మే శివాజీరాజే భోసలే బోల్టోయ్', 'గోలా బెరిడ్జ్', 'పోలీస్ లైన్' అలాగే '1234' వంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇక కేవలం మరాఠీ సినిమాలు మాత్రమే కాక అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం 'బాంబే వెల్వెట్'లో కూడా ప్రదీప్ ఒక కీలక పాత్రలో కనిపించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రదీప్ పట్వర్ధన్ తన ఆరోగ్యం దృష్ట్యా సినిమాలకు, నాటకాలకు దూరంగా ఉంటున్నారు. ప్రదీప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ కొన్ని సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేశాడు.

ఆయన ఒక సినిమాలో విలన్ పాత్ర కూడా పోషించారు. అయితే ఆయన చేసిన కామెడీ క్యారెక్టర్లనే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడ్డారు. దీంతో ప్రదీప్ పట్వర్ధన్ ఎక్కువ కామెడీ క్యారెక్టర్లు చేసేవారు. అలా ప్రదీప్ పట్వర్ధన్ మరాఠీ సినిమాల్లో కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ముంబైలోనే ప్రదీప్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఠాకూర్‌ద్వార్ యథికానాలోని జవ్బా వాడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన అంత్యక్రియలు ప్రారంభమవుతాయని కుటుంబసభ్యులు వెల్లడించారు. 

Also Read: Tollywood: కోట్లలో బింబిసార లాభాలు.. సీతారామం బ్రేక్ ఈవెన్ కు కొద్ది దూరంలో.. వసూళ్ల వివరాలివే!

Also Read: Bigg Boss Telugu Season 6 : ఎదురు చూపులకు బ్రేక్.. ఇక వచ్చేస్తోంది బిగ్ బాస్ 6.. ప్రోమో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News