Janmashtami 2022: జన్మాష్టమి సమీపిస్తోంది. జన్మాష్టమి కచ్చితంగా ఎప్పుడనే విషయంపై చాలామందిలో సందేహాలున్నాయి. ఆగస్టు 18 లేదా ఆగస్టు 19..రెండింట్లో ఎప్పుడు జరుపుకోవాలనే సందిగ్దత ఏర్పడింది. ఆ వివరాలు తెలుసుకుందాం..
భాద్రపదం నెల కృష్ణపక్షంలో అష్టమి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవడం ఆనవాయితీ. దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి అత్యంత ఘనంగా జరుపకుంటారు. శ్రీ కృష్ణుడి జన్మస్థలమైన మధురలో కృష్ణాష్టమని సంబరాల్ని చూసేందుకు దేశవిదేశాల్నించి తరలివస్తుంటారు భక్తులు. ఇంట్లో, ఆలయాల్లో కృష్ణుడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది జన్మాష్టమి ఎప్పుడనే విషయంపై సందిగ్దత ఏర్పడింది. ఆగస్టు 18 లేదా ఆగస్టు 19లో ఎప్పుడు జరుపుకోవాలనే సందేహాలున్నాయి.
జన్మాష్టమి 2022 తేదీ, శుభ ముహూర్తం ఎప్పుడు
భాద్రపదంలోని అష్టమి తిధి ఆగస్టు 18వ తేదీ రాత్రి 9.20 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఆగస్టు 19వ తేదీ రాత్రి 10.59 నిమిషాల వరకూ ఉంటుంది. అంటే శ్రీ కృష్ణుడి జన్మం ఆర్ధరాత్రి జరిగింది. అందుకే ఆగస్టు 18వ తేదీ రాత్రి జరుపుకోవాలి. ఇదే రోజున ధృవ, వృద్ధి యోగం కూడా ఉంది. ఈ రెండు కలవడం అత్యంత శుభ సూచకం. ఆగస్టు 18వ తేదీ జన్మాష్టమి పూజ చేసేందుకు శుభ ముహూర్తం ఆగస్టు 18 రాత్రి 12.03 నిమిషాల్నించి 12.47 నిమిషాలవరకూ ఉంది.
గోపాలుడి పూజ ఎలా చేయాలి
జన్మాష్టమి రోజున శ్రీ కృష్ణుడి బాలరూపమైన లడ్డూ గోపాలుడి పూజ జరుపుతారు. రాత్రి 12 గంటలకు కృష్ణుడు పుట్టిన తరువాత పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేస్తారు. బాల గోపాలుడిని అత్యంత సుందరంగా అలంకరించి..వెన్న, పట్టికబెల్లం సమర్పిస్తారు. దాంతోపాటు పసుపు వస్త్రాలు, తులసీ ఆకులు, పూలు, పండ్లు అర్పిస్తారు. దూఫదీపం వేస్తారు. ఉయ్యాల ఊగిస్తారు. చివరిగా కన్హయ్యను అభిషేకించే పంచామృతాన్ని అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు.
Also read: GAIL JOBS 2022: నిరుద్యోగులకు శుభవార్త, గెయిల్ నోటిఫికేషన్ విడుదల, ఆగస్టు 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook