Gun Fire: హైదరాబాద్‌ శివారులో మళ్లీ కాల్పులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Gun Fire:  హైదరాబాద్ శివారు ప్రాంతాలు అరాచకాలకు అడ్డాగా మారిపోయాయా? తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోయిందా? అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలతో నిజమేనని తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫాంహౌస్ లు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి.

Written by - Srisailam | Last Updated : Aug 16, 2022, 11:02 AM IST
  • హైదరాబాద్‌ శివారులో మళ్లీ కాల్పులు
  • ఫాంహౌస్‌లో గాల్లోకి కాల్పులు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Gun Fire: హైదరాబాద్‌ శివారులో మళ్లీ కాల్పులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Gun Fire: హైదరాబాద్ శివారు ప్రాంతాలు అరాచకాలకు అడ్డాగా మారిపోయాయా? తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోయిందా? అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలతో నిజమేనని తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫాంహౌస్ లు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఫాంహౌస్ లో కాల్పుల ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. మందు పార్టీలు చేసుకుంటున్న యువకులు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరుపుతున్న ఘటనలు వెలుగులోకని వస్తున్నాయి.

తాజాగా హైదరాబాద్ శివారు యాచారం సమీపంలోని  ఓ ఫాంహౌస్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.  ఫాంహౌస్‌లో పార్టీ చేసుకున్న యువకులు.. అదే జోష్ లో  తమ వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. దాదాపు నెల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు గుర్తించారు. యాచారం సీఐ లింగయ్య ఫాంహౌస్‌ను పరిశీలించారు.  గాల్లోకి కాల్పులు జరిపిన  ఎయిర్‌గన్‌ పిల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గన్‌  పత్రాలను పరిశీలించారు.

కాల్పుల ఘటనకు సంబంధించి యాచారం పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడకు చెందిన జిట్ట్టా రవీందర్‌రెడ్డికి యాచారం మండలం నజ్దిక్‌సింగారంలో ఫాంహౌస్‌ ఉంది. కందుకూరు చెందిన యువకులు అప్పుడప్పుడు పార్టీ జరుపుకుంటుంటారు. గత నెల 14న కూడా పార్టీ జరిగింది. విందుకు రవీందర్ రెడ్డి సన్నిహితులు విఘ్నేశ్వర్‌రెడ్డి, విక్రంరెడ్డితో పాటు మరో 15 మంది వచ్చారు. పార్టీ జరుగుతుండగానే తన దగ్గర ఉన్న ఎయిర్ గన్ ను స్నేహితులకు చూపించారు రవీందర్ రెడ్డి. ఆ గన్ పట్టుకుని సరదాగా పోటోలు తీసుకున్నారు కొందరు యువకులు. అత్యుత్సాహంతో కొందరు గాలిలోకి కాల్పులు జరుపుతూ వీడియో తీసుకున్నారు. కొందరు ఫొటోలు దిగారు. గాల్లోకి ఫైర్ చేసిన వీడియోను కొందరు యువకులు ఆ వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకుని కాసేపటికే తీసేశారు.అయితే అందులోని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోమవారం పోలీసుల దృష్టికి వచ్చింది.

Read Also: Jagan Govt: ఒక్క నిమిషం లేటైనా ఆబ్సెంటే! ఏపీ టీచర్లకు కొత్త సిస్టమ్..

Read Also: Tirumala: భక్తులకు 40 గంటలు.. మంత్రి అనుచరులకు నిమిషాల్లో దర్శనం! తిరుమలలో వైసీపీ నేతల దౌర్జన్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News