Bandla Ganesh: పవన్ కళ్యాణ్ సినిమా లేనట్టే.. వింత ట్వీట్ తో కొత్త అనుమానాలు రేపిన బండ్ల!

Bandla Ganesh Gives Update on Pawan Kalyan Movie: పవన్ కళ్యాణ్ తో మీ సినిమా ఉంటుందా ఉండదా అని అడిగిన ఒక అభిమానికి బండ్ల గణేష్ వింత సమాధానం ఇచ్చారు. ఆ వివరాలు   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 16, 2022, 10:13 AM IST
Bandla Ganesh: పవన్ కళ్యాణ్ సినిమా లేనట్టే.. వింత ట్వీట్ తో కొత్త అనుమానాలు రేపిన బండ్ల!

Bandla Ganesh Gives Update on Pawan Kalyan Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.  ఈ సారి ఎలా అయినా జనసేనను అధికారంలోకి తీసుకురావాలని ఆయన నిరంతరం ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపద్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే చివరిగా భీమ్లా నాయక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ మరో నాలుగు సినిమాలను ప్రకటించారు.

కానీ ఇప్పుడు ఆ సినిమాలు అసలు రిలీజ్ అవుతాయా? లేదా? అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. ఇప్పటికే ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా సగం షూటింగ్ జరిపారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేయాల్సి ఉంది. మరోపక్క బండ్ల గణేష్ నిర్మాతగా కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ అసలు ఆ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు.

అలాగే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ గతంలో నిలిచి పోగా మళ్ళీ ప్రారంభించాలని  నిర్ణయం తీసుకున్న తర్వాత తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగ్స్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు సినిమాలు చేస్తున్నారా? లేదా? అనే విషయం మీద మరిన్ని అనుమానాలు కలిగే విధంగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. జనసేన సాయి అనే ఒక కార్యకర్త బండ్ల గణేష్ అన్న,  పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఎప్పుడు అన్న? ఒకసారి కొంచెం క్లారిటీ ఇవ్వు అన్న! అసలు సినిమా ఉందా? లేదా? అర్థం కావడం లేదన్న ప్లీజ్ రెస్పాండ్ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించడంతో దానికి బండ్ల ఆసక్తికరంగా స్పందించారు.

‘’మనది నిజమైన అభిమానం అయితే మనం నిజంగా ఆయనను ప్రేమిస్తే ఆయన చేయబోతున్న కార్యక్రమానికి మంచి కలగాలని కోరుకుందాం,  సినిమా అనేది వ్యాపారం,  ఆయనను దయచేసి ఇబ్బంది పెట్టకూడదు. ఇది మన బాధ్యత,  ఆయన స్థానం వేరు,  ఆయన స్థాయి వేరు” అంటూ బండ్ల గణేష్ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. అయితే అసలు సినిమా చేస్తున్నారా లేదా అని అడిగితే చేస్తున్నానని లేదా చేయడం లేదని చెప్పకుండా ఆయన చేయబోతున్న కార్యక్రమానికి మంచి కలగాలని కోరుకుందాం సినిమా అనేది వ్యాపారం కాదు అంటూ బండ్ల పేర్కొనడం చూస్తే పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ తో సినిమా చేయడం లేదనే విషయం మీద కొంత క్లారిటీ వచ్చినట్లు అవుతుంది. అయితే అది బండ్ల గణేష్ సినిమాకు మాత్రమే వర్తిస్తుందా ఆయన ప్రకటించిన మిగతా సినిమాలకు కూడా వర్తిస్తుందా? అనే విషయం ఇప్పుడు ఆయన అభిమానులకు టెన్షన్ రేపుతోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.
Also Read: Prashanth Neel: సొంతూరి కోసం ప్రశాంత్ నీల్ మనసున్న పని.. ఒక్కసారిగా 50 లక్షలు విరాళం!

Also Read: Sahithi: హీరోయిన్ గా శేఖర్ మాస్టర్ కూతురు సాహితి.. హీరో ఎవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News