/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

SBI Free Doorstep Banking Services: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' కరోనా కాలంలో 'డోర్ స్టెప్' సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సీనియర్ సిటిజనెన్లు, వికలాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు, అంధులు, సింగిల్/జాయింట్ అకౌంట్ హోల్డర్స్, బ్యాంకు బ్రాంచ్‌కి 5 కి.మీ పరిధిలో నివాసముండే కస్టమర్స్‌కి ఎస్‌బీఐ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను మరింత విస్తృతం చేస్తూ వికలాంగులకు నెలలో 3 సార్లు ఉచిత డోర్ స్టెప్ సర్వీస్ అందించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఎస్‌బీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. డోర్ స్టెప్ సర్వీస్ ద్వారా బ్యాంక్ సిబ్బందే ఇంటికి వచ్చి బ్యాంకింగ్ సేవలను అందిస్తారు. ఈ సేవలను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా :

మొదట ఎస్‌బీఐ యోనో యాప్ ఓపెన్ చేయాలి

ఇందులో సర్వీస్ రిక్వెస్ మెనూ ఆప్షన్ ఎంచుకోవాలి

డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

చెక్ పికప్, క్యాష్ పికప్ తదితర సేవల కోసం ఇక్కడ మీరు రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది

డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి :

ఎస్‌బీఐ కస్టమర్స్ టోల్ ఫ్రీ నంబర్స్ 1800 1037 188 లేదా 1800 1213 721 ద్వారా డోర్ స్టెప్ సర్వీసులు పొందవచ్చు.

డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా అందించే సేవలు :

డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా పికప్, డెలివరీ, ఇతరత్రా సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

క్యాష్ పికప్

క్యాష్ డెలివరీ

చెక్ పికప్

చెక్ రిక్విజిషన్ స్లిప్ పికప్

ఫామ్ 15H పికప్

డ్రాఫ్ట్స్ డెలివరీ

టర్మ్ డిపాజిట్ అడ్వైజ్

లైఫ్ సర్టిఫికెట్ పికప్

కేవైసీ డాక్యుమెంట్స్ పికప్

కస్టమర్స్‌కు ముఖ్య గమనిక :

డోర్ స్టెప్ సర్వీసులు కేవలం హోం బ్రాంచికే వర్తిస్తాయి.

ఒకరోజులో కేవలం రూ.20 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చు.

వికలాంగులకు నెలలో 3 ఉచిత సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మిగతా కస్టమర్స్‌కు నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌పై జీఎస్టీతో పాటు రూ.60, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు జీఎస్టీతో పాటు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: DA Hike Updates: డీఏ పెంపుపై కీలక అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం ఎంత పెరగనుందంటే..  

Also Read : Kaushik LM: సినీ పరిశ్రమలో విషాదం.. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
sbi free doorstep banking services monthly 3 free services for differently abled customers
News Source: 
Home Title: 

Free Doorstep Banking Services: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు గుడ్ న్యూస్... అందుబాటులోకి ఉచిత డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్..
 

Free Doorstep Banking Services: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు గుడ్ న్యూస్... అందుబాటులోకి ఉచిత డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్..
Caption: 
sbi free doorstep banking services (Representational Image)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్..

ఉచిత డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రకటించిన ఎస్‌బీఐ

ఈ సర్వీస్ ఎవరికి వర్తిస్తుంది.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

Mobile Title: 
ఎస్‌బీఐ కస్టమర్స్‌కు గుడ్ న్యూస్... అందుబాటులోకి ఉచిత డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్
Srinivas Mittapalli
Publish Later: 
No
Publish At: 
Tuesday, August 16, 2022 - 13:15
Request Count: 
88
Is Breaking News: 
No