Music Director Pramod Kumar Parisarla Passed Away: సినీ పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే గత కొన్నాళ్లుగా పలు భాషలకు చెందిన నటీనటులు అలాగే ఇతర టెక్నీషియన్స్ అనారోగ్య కారణాలతో కన్నుమూయగా ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్ ఇటీవల సంగీత దర్శకుడిగా మారిన ప్రమోద్ కుమార్ పరిసర్ల అనే ఆయన గుండెపోటు కారణంగా కన్నుమూశారు. విశాఖపట్నంకి చెందిన ప్రమోద్ కుమార్ సినీ పరిశ్రమలో సౌండ్ ఇంజనీర్ గా పరిచయమై అనేక సినిమాలకు సౌండ్ ఇంజనీర్ గా పనిచేశారు. ఎఫ్2 కాలాయ తస్మై నమః వంటి సినిమాలకు ఆయన సౌండ్ ఇంజనీర్ గా పని చేశారు.
అలాగే అనేక యాడ్స్, ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, సినిమాలు చేస్తూ ఉండేవారు. అయితే ఆయన దామిని విల్లా అనే సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం కావాల్సి ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ దామిని విల్లా అనే సినిమాలో ఒకప్పటి హీరో ఆదిత్య ఓం హీరోగా నటించారు. అలాగే తెలుగమ్మాయి రేఖా బోజ్ హీరోయిన్ గా నటించారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. దండం పోలా రావు అనే నిర్మాత నిర్మించిన ఈ సినిమాకు రాకేష్ రెడ్డి దర్శకుడుగా వ్యవహరించారు.
ఇక ప్రమోద్ మరణంతో రాకేష్ రెడ్డి ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. ‘’నా మొదటి సినిమా కాలాయ తస్మై నమః సౌండ్ ఇంజనీర్ గా పరిచయమై ప్రతిరోజూ పని అయ్యాక నువ్వు నేను కలిసి తెల్లారే దాకా బీర్లు కొట్టే వాళ్ళం, ఆ మూవీ అయ్యాక వరుసగా యాడ్స్, ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, సినిమాలు కలిసి దాదా 10 ప్రాజెక్టులకు పని చేశాం, నా ఆఫీస్ లోనే దాదాపు రెండు సంవత్సరాలు ఉన్నావు కలిసి కొన్ని వందలసార్లు మిడ్ నైట్ సాంబార్ ఇడ్లీ, టీ కొట్టేవాళ్లం, మన సినిమా గ్యాంగ్ లో రాత్రంతో రోడ్లపై షికార్లు చేశాం, మన చివరి ప్రాజెక్ట్ దామిని విల్లా నిన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా మరో లెవల్ కు తీసుకు వెళుతుంది అనుకున్నాం కానీ ఇంతలోనే ఇలా నన్ను వదిలేసి వెళ్లావు, మనసు ఎలా ఒప్పింది నేస్తం ఇలా వదిలేయడానికి నీ జ్ఞాపకాలే మిగిలాయి’’, నా దామిని విల్లా నీకే అంకితం అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక హీరోయిన్ రేఖ భోజ్ కూడా ప్రమోద్ అన్న మీ ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటున్నాను, గత 6 సంవత్సరాలలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read: Sukumar Sudden Shock: పుష్ప నటుడికి షాకిచ్చిన సుకుమార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి