Gharana Mogudu Special Trailer: ఆసక్తి రేకెత్తిస్తున్న ఘరానా మొగుడు స్పెషల్ ట్రైలర్.. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్!

Gharana Mogudu Re Release Trailer Relased: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా రీ రిలీజ్ అవుతున్న ఘరానా మొగుడు సినిమాకు సంబందించిన స్పెషల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2022, 11:37 AM IST
Gharana Mogudu Special Trailer: ఆసక్తి రేకెత్తిస్తున్న ఘరానా మొగుడు స్పెషల్ ట్రైలర్.. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్!

Gharana Mogudu Re Release Trailer Relased: ఈ మధ్య ఎప్పుడో విడుదలైన సినిమాలను మళ్లీ రీ రీలీజ్ చేస్తున్న ట్రెండ్ పెరిగింది. ఆయా హీరోల పుట్టినరోజు సందర్భంగా సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు పుట్టినరోజు అయిన ఆగస్టు 9వ తేదీన పోకిరి, ఒక్కడు సినిమాలను థియేటర్లలో విడుదల చేయగా ఈ రెండు సినిమాలు రికార్డ్ స్థాయి కలెక్షన్లు సాధించాయి ఈ సినిమాలు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆగస్టు 21వ, తేదీ 22వ తేదీలలో  ఘరానా మొగుడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

1991లో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది.  మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను దేవి వరప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా నగ్మా, వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించారు. రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, రమాప్రభ, ఆహుతి ప్రసాద్, సాక్షి రంగారావు, చలపతిరావు  వంటి వారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా అప్పట్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇక బంగారు కోడిపెట్ట అంటూ డిస్కో శాంతి చేసిన ఐటెం నెంబర్ కూడా సినిమాకి మరింత క్రేజ్ తీసుకువచ్చింది. అలా ఈ సినిమా 105 ప్రింట్ లతో రిలీజ్ చేస్తే సుమారు 62 కేంద్రాలలో 50 రోజులు, 39 కేంద్రాలలో వంద రోజులు ఆడి అప్పట్లో అనేక రికార్డులు బద్దలు కొట్టింది.

అంతేకాక నైజాంలో 50 ధియేటర్లలో రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమాగా కూడా ఈ సినిమా నిలిచింది. హైదరాబాద్ సంధ్య 70 ఎంఎంలో రోజుకు నాలుగు ఆటలతో 175 రోజులు సినిమా ఆడింది అంటే అప్పట్లో ఈ సినిమా ఎంత సూపర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే గుంటూరులో అనిల్ కపూర్, దాసరి నారాయణరావు వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరైన ఈ సినిమా శత దినోత్సవ వేడుకలు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో 4 లక్షల మంది అభిమానుల సమక్షంలో కానీ విని ఎరుగని రీతిలో జరిగాయి.

ఇక ఈ సినిమా డబ్బింగ్ హక్కులు మలయాళంలో లక్ష రూపాయలకు అమ్మితే సినిమా ఫుల్ రన్ లో కోటి రూపాయలు వసూలు చేసింది అంటే దాదాపుగా 99 రెట్లు ఈ సినిమా లాభాలు తెచ్చి పెట్టింది. సుమారు నాలుగు సెంటర్లలో వంద రోజులు కూడా ఆడిన ఈ సినిమా మళ్లీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇక ఈ సినిమా రీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా స్పెషల్ ట్రైలర్ కట్ ను విడుదల చేశారు. అఫీషియల్ ట్రైలర్ కాకపోయినా మెగాస్టార్ అభిమానులు ఈ ట్రైలర్ ను వింటేజ్ మెగాస్టార్ ఇస్ బ్యాక్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఆరిపోయింది.

Also Read: Sukumar Sudden Shock: పుష్ప నటుడికి షాకిచ్చిన సుకుమార్

Also Read: Three Heros Missed Sita Ramam: సూపర్ హిట్ సినిమా ‘సీతారామం’ను మిస్ చేసుకున్న హీరోలు వీరే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News