Karimnagar: కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అలుగునూరులో అనూష అనే మహిళ..భర్త, పిల్లలతో నివసిస్తోంది. ఐతే గతకొంతకాలం నుంచి ఆమె కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఇటీవల వ్యాధి తీవ్రమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ఇంటి వద్ద పిల్లల తీరు చూసి తండ్రితోపాటు స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు.
అమ్మా లెమ్మని ఒకరు..అమ్మా రా అని ఇంకొకరు పిలుస్తున్న దృశ్యాలు కనిపించాయి. తల్లి చనిపోయిందన్న విషయం తెలియక మృతదేహం వద్ద పిల్లల వేదన కంటతడి పెట్టించింది. మృతదేహాన్ని పిల్లలు ముద్దాడారు. చిన్నారుల స్థితి చూసి స్థానికులు విలపించారు. అమ్మ చనిపోయిందన్న విషయం తెలియక..ఎప్పటిలాగే అక్కడే ఆడుకున్నారు. అమ్మ వద్దకు వెళ్లారు. తల్లిని ముద్దాడారు. ఈహృదయ విదారక దృశ్యాలు చూసి అక్కడున్న వారంతా తల్లడిల్లిపోయారు.
Also read:Farmers Protest: లఖింపుర్‌ఖేరీలో ఉధృతమవుతున్న రైతు ఉద్యమం..న్యాయం చేయాలని డిమాండ్..!
Also read:Vijayashanthi: రాములమ్మ పార్టీ మారుతున్నారా..బీజేపీ నేతలపై వ్యాఖ్యల వెనుక ఆంతర్యం అదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook