Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో అధికార పార్టీలో వర్గపోరు దుమారం రేపుతోంది. నేతలు రెండు వర్గాలుగా మారి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో అధికార పార్టీలో వర్గపోరు దుమారం రేపుతోంది. నేతలు రెండు వర్గాలుగా మారి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. నాయకుల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరు రాజకీయంగా కీలక నియోజకవర్గం. రాచమల్లు శివప్రసాదురెడ్డి ప్రొద్దుటూరు నుండి 2014, 2019 లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాచమల్లు తర్వాత ప్రొద్దుటూరులో అంతటి స్థాయి నాయకుడు లేకపోవడం, ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో మొదట్లో అక్కడ రాచమల్లు చెప్పిందే శాసనంగా చెల్లింది.