Heart Attack Risk: ఆ సమస్య ఉంటే..గుండె పోటు ముప్పు అధికమే, అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడి

Heart Attack Risk: కొంతమందికి పుట్టుకతోనే ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురౌతుంటాయి. ముఖ్యంగా ఓ డిజార్డర్ వేధిస్తుంటుంది. ఈ డిజార్డర్ కారణంగా గుండె సంబంధిత ముప్పుు 3-4 రెట్లు అధికమౌతుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 30, 2022, 05:19 PM IST
Heart Attack Risk: ఆ సమస్య ఉంటే..గుండె పోటు ముప్పు అధికమే, అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడి

Heart Attack Risk: కొంతమందికి పుట్టుకతోనే ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురౌతుంటాయి. ముఖ్యంగా ఓ డిజార్డర్ వేధిస్తుంటుంది. ఈ డిజార్డర్ కారణంగా గుండె సంబంధిత ముప్పుు 3-4 రెట్లు అధికమౌతుంది. 

టైప్ 1 డయాబెటిస్ సోరియాసిస్, సిస్టమిక్ స్కెల్రోసిస్, రుమటాయిడ్ ఆర్ధరైటిస్ వంటి రోగాలు కొంతమందిలో చిన్నతనం నుంచి ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కారణంగా ఈ వ్యాధులు వస్తుంటాయి. ఈ సమస్య ఉన్నవారికి కార్డియో వాస్క్యులర్ రోగాల ముప్పు అధికంగా ఉంటుంది. పుట్టుకతోనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సమస్య ఉంటే..వివిధ రకాల రోగాలు తరచూ వేధిస్తుంటాయి. అమెరికా, యూరప్ దేశాల్లో దాదాపు 10 శాతం జనాభా ఆటో ఇమ్యూన్ రోగంతో ఉన్నారని తెలుస్తోంది. ఇండియాలో కూడా ఈ సమస్య ఎక్కువగానే ఉంది. 

టైప్ 1 డయాబెటిస్, ల్యూప్స్ ఎరిథ్‌మెటోసిస్, సోరియాసిస్, సిస్టమిక్ స్కెల్రోసిస్, రుమటాయిడ్ ఆర్ధరైటిస్ వ్యాధులు ఆటో ఇమ్యూన్ రోగాలే. కేయూ ల్యూవెన్ నేతృత్వంలోని ఒక అంతర్జాతీయ దర్యాప్తు బృందం..బార్సిలోనాలో గత వారం నిర్వహించిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియోలజీ వార్షికోత్సవంలో 19 అత్యంత సాధారణమైన ఆటో ఇమ్యూన్ రోగాలకు, గుండె వ్యాధులకు మధ్య ఉన్న సంబంధంపై నివేదిక సమర్పించింది. 

ఈ అధ్యయనం ప్రకారం ఆటో ఇమ్యూన్ రోగాలతో బాధపడుతున్నవారిలో ఆరోగ్యంగా ఉండే వ్యక్తితో పోలిస్తే గుండె సంబంధిత రోగాల ముప్పు 1.4 నుంచి 3.6 రెట్లు అధికంగా ఉంటుంది. అయితే రిస్క్ ఎంతవరకూ ఉంటుందనేది చికిత్సపై ఆధారపడి ఉంటుంది. 

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి గుండె సంబంధిత రోగాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉండేవారికి కూడా ఇదే పరిస్థితి ఈ అధ్యయనంలో ఆటో ఇమ్యూన్ రోగాలు గుండె సంబంధిత ముప్పుకు కారణమని తొలిసారి విశ్లేషించారు. మొత్తం 19 ఆటో ఇమ్యూన్ రోగాలపై పరిశోధన చేశారు. ఇందులో గుండె రోగాలు 6 శాతమున్నాయి. ఆటో ఇమ్యూన్ రోగం కారణంగా అన్ని రకాల కార్డియో వాస్క్యులర్ డిసీజ్ ముప్పు పెరిగిపోతుంది. ఆటో ఇమ్యూన్ రోగం ప్రీమెచ్యూర్ కార్డియోవాస్క్యులర్ రోగాల్లో కీలక భూమిక వహిస్తోంది. 55 ఏళ్లవారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంది.

Also read: Type 1 Diabetes: టైప్ 1 డయాబెటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, కారణాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News