24 Crafts of Movies you have to Know: సినిమాలపై అందరికీ చాలా ఆసక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న 24 క్రాఫ్ట్స్ ఏమిటి? అనే విషయం చాలా మందికి తెలియదు. పేరుకు 24 క్రాఫ్ట్స్ అని వింటూ ఉంటారు కానీ ఆ 24 క్రాఫ్ట్ లు ఏమేమిటి? 24 క్రాఫ్ట్ లకు సంబంధించిన వారు ఏమేం పని చేస్తారు? అనే విషయాలు చాలా మందికి తెలియదు. 24 క్రాఫ్ట్ లు ఏమేమిటి? వారు ఏమేం పని చేస్తారు? అనే విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
1)స్టంట్ డైరెక్టర్లు -స్టంట్ ఆర్టిస్టులు
వీళ్ళు సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ లను డైరెక్ట్ చేస్తూ ఉంటారు. సినిమాకి దర్శకుడు అన్నీ అయినా సరే స్టంట్ డైరెక్టర్ మాత్రమే ఫైట్లను డిజైన్ చేస్తూ ఉంటారు. అలాగే స్టంట్ ఆర్టిస్టులు కూడా ఇదే క్రాఫ్ట్ కిందకు వస్తారు.
2)ఆర్ట్ డైరెక్షన్
తర్వాత విభాగం ఆర్ట్ డైరెక్షన్. ఆర్డర్ డైరెక్టర్ సినిమాకి సంబంధించి ప్రాపర్టీస్ చూసుకుంటారు. దర్శకుడు రిక్వైర్మెంట్ కి తగినట్లుగా బ్యాగ్రౌండ్ లో ఉండాల్సిన అన్ని విషయాలను ఫైనలైజ్ చేసేది ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారే.
3)సినిమాటోగ్రఫీ
ఇక మరో విభాగం సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీని డైరెక్టర్ ఆ ఫోటోగ్రఫీ అని కూడా అంటారు. సినిమాటోగ్రాఫర్ సినిమా మొత్తాన్ని తన కెమెరాతో బంధించి ఎడిటింగ్ విభాగానికి అందజేస్తారు.
4) ఎడిటింగ్
ఇక తర్వాతి విభాగం ఎడిటింగ్. షూటింగ్లో భాగంగా చాలా సీన్లు డైరెక్టర్ షూట్ చేస్తూ ఉంటారు. కానీ వాటన్నింటినీ ఒక వరుస క్రమంలో పేర్చి దర్శకుడు అనుకున్న కథకు తగ్గట్టు ఫైనల్ అవుట్ ఫుట్ ఇచ్చేది ఎడిటర్.
5) డబ్బింగ్
తర్వాత విభాగం వచ్చేసి డబ్బింగ్. ఒకప్పుడు సినిమా షూటింగ్ జరిగిన తర్వాత మళ్లీ ఆయా పాత్రలకు దానికి సంబంధించిన నటీనటులు కానీ లేదా పాత్రకు సరిపడా గొంతు ఉన్న వ్యక్తులు గాని డబ్బింగ్ చెప్పేవారు. ఇప్పుడు సింక్ సౌండ్ సిస్టం వచ్చిన తర్వాత డబ్బింగ్ పరిశ్రమ ప్రమాదంలో పడిందని వాదన వినిపిస్తోంది.
6) సినిమా డ్రైవర్లు
ఇక సినిమా డ్రైవర్లు. సినిమా షూటింగ్ మొదలు ఫైనల్ అవుట్ ఫుట్ విడుదలయ్యే వరకు దర్శకుడు సహా సినిమా యూనిట్ మొత్తం అనేక ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంటుంది. వారిని గమ్యస్థానాలకు చేర్చే డ్రైవర్లను సినిమా డ్రైవర్లు అంటారు. మీరు కూడా 24 క్రాఫ్ట్ లలో ఒక క్రాఫ్ట్ వారే.
7)ప్రొడక్షన్ వుమెన్
మరో విభాగం ప్రొడక్షన్ వుమెన్. ఇక ఈ డిపార్ట్మెంట్లో మొత్తం స్త్రీలు మాత్రమే ఉంటారు. వీరు ప్రొడక్షన్ అసిస్టెంట్ల సూచనల మేరకు సినిమా సెట్ మొత్తాన్ని క్లీన్ గా ఉంచుతూ ఉంటారు. అలాగే సినిమా యూనిట్ తిన్న భోజన పాత్రలను, వంట పాత్రలను క్లీన్ చేస్తూ ఉంటారు. సినిమా షూటింగ్ ఎడారిలో జరిగినా సముద్రం ఒడ్డున జరిగినా సరే వీరు కచ్చితంగా అక్కడ ఉండి తీరాల్సిందే.
8)స్టోరీ రైటింగ్
మరో విభాగం స్టోరీ రైటింగ్. సినిమా నిర్మాత దగ్గర ఒక అందమైన హీరో, హీరోయిన్ అలాగే మంచి దర్శకుడు ఉన్నాసరే సినిమా మొత్తానికి కథే ప్రాణం. ఈ సినిమా కథ రాసే వారిని కథా రచయిత అంటారు. వీరిది ఒక విభాగం.
9)మ్యూజిక్ డైరెక్షన్
ఇక మరో విభాగం విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్షన్. సినిమా ఎంత బాగా వచ్చినా సరే దాన్ని మరో లెవెల్ కి తీసుకు వెళ్ళేది సంగీతమే. అసలు పసలేని సీన్లకు కూడా ప్రాణం తెప్పించే మహిమ ఈ సంగీతానికి ఉంది.
10)ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్
మరో విభాగం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్. ఈ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లు షూట్ మొదలైంది మొదలు, పూర్తయ్యే వరకు అన్ని తామే చూసుకుంటారు. ప్రొడ్యూసర్ ఆదేశాల మేరకు వీరు పని చేస్తూ ఉంటారు. ఈరోజు షూటింగ్ కు ఎంతమంది వస్తున్నారు? ఎవరెవరికి కార్లు పంపించాలి? అలాగే వారికి భోజన వసతి, ఎలా వాళ్లని చివరికి షూటింగ్ అయిన తర్వాత డ్రాప్ చేసే వరకు అన్ని బాధ్యతలు వేరే దగ్గరుండి చూసుకుంటారు.
11) లైటింగ్
ఇక మరో విభాగం లైటింగ్ విభాగం. ఈ లైటింగ్ విభాగానికి ప్రత్యేకత ఉంది. ఒక రాత్రిని పగలులా మార్చాలి అన్న, పగలు రాత్రిగా మార్చాలన్న తమ లైటింగ్ టెక్నిక్స్ తో వీరు మ్యాజిక్ చేస్తూ ఉంటారు. అవసరానికి అనుగుణంగా వీరు లైటింగ్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది.
12) స్టూడియో వర్కర్స్
ఇక మరో విభాగం స్టూడియో వర్కర్స్ వివిధ వర్గాలకు చెందిన కార్పెంటర్లు, పెయింటర్లు సెట్ తయారీదారులు అందరూ కూడా ఈ స్టూడియో వర్గాల విభాగానికి వస్తారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కి కావాల్సిన విధంగా వారు కోరిన విధంగా ప్రాపర్టీలు సిద్ధం చేయటమే వారి ముఖ్య పని.
13) ప్రొడక్షన్ అసిస్టెంట్లు
ఇక ప్రొడక్షన్ అసిస్టెంట్లు వీరిని ప్రొడక్షన్ అసిస్టెంట్లు - సెట్ అసిస్టెంట్లని కూడా పిలుస్తూ ఉంటారు. వీళ్ళు సెట్ లో ఉన్న అందరికీ ఆహార పదార్థాలు అందజేస్తూ ఉంటారు. ఆహార అవసరాలకు అనుగుణంగా వీరు ఆహారాన్ని అందజేస్తూ సినిమా షూటింగ్ ఎక్కడా ఇబ్బంది లేకుండా జరిగేందుకు తమ వంతు పాత్ర పోషిస్తారు.
14) మేకప్ మాన్
ఇక మేకప్ మాన్ విషయానికి వస్తే సినిమా షూటింగ్లో ముఖ్యపాత్ర పోషిస్తారు. ఒక యవ్వనంలో ఉన్న స్త్రీని ముసలిగా మార్చాలన్న, ముసలిగా ఉన్న ముఖాన్ని యవ్వనంగా మార్చాలి అన్న వీరు తమ పనితనాన్ని చూపిస్తారు.
15) కాస్ట్యూమ్ డిజైనర్లు
ఇక కాస్ట్యూమ్ డిజైనర్ల విషయానికి వస్తే వీరు కూడా సినిమా ఫ్రేమ్లో కనిపించే అందరి బట్టలు ఎలా ఉండాలని విషయాన్ని డిజైన్ చేస్తూ ఉంటారు. దర్శకుడి అవసరానికి తగినట్లుగా వీరు నటీనటులకు దుస్తులు సిద్ధం చేస్తూ ఉంటారు.
16) సినీ ఆర్టిస్టులు
ఇక వీరందరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నటీనట్లుందరి గురించి మనకు బాగా తెలిసిందే.
17) ఆడియో
డబ్బింగ్, రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ లాంటివన్నీ కూడా ఆడియోగ్రాఫర్లు చూసుకుంటూ ఉంటారు. అది లవ్ స్టోరీ అయినా హారర్, థ్రిల్లర్ అయినా సరే సౌండ్ ఎఫెక్ట్స్ తోటి ప్రేక్షకులు కొంతవరకు కనెక్ట్ అవుతారు.
18) పబ్లిసిటీ ఆర్టిస్టులు
ఇక తరువాతి విభాగం పబ్లిసిటీ ఆర్టిస్టులు, మీరు వివిధ రకాల మీడియాల ద్వారా సినిమాని పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు కేవలం పోస్టర్ల ద్వారానే పబ్లిసిటీ జరిగేది. కానీ ఇప్పుడు పాటలు ట్రైలర్లు, టీజర్లు ఇలా రకరకాల విధాలుగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
19) జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్
సినిమాకి కావలసిన జూనియర్ ఆర్టిస్టులను వీరు సప్లై చేస్తూ ఉంటారు.
20) అవుట్ డోర్ టెక్నీషియన్లు
సినిమా షూటింగ్ అవుట్డోర్లో గనక జరుగుతుంటే ఈ అవుట్డోర్ యూనిట్ టెక్నీషియన్స్ కచ్చితంగా ఉంటారు. కెమెరా డిపార్ట్మెంట్, లైటింగ్ డిపార్ట్మెంట్ సహా మిగతా అన్ని డిపార్ట్మెంట్ లకు వీరు సహకారం అందిస్తారు.
21) స్టిల్ ఫోటోగ్రాఫర్లు
వీరు కూడా 24 విభాగాలలో ఒక విభాగమే. వీరు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆసక్తికరమైన స్టిల్స్ ను క్యాప్చర్ చేస్తూ ఉంటారు. వాటినే పోస్టర్ల ద్వారా పబ్లిసిటీ చేస్తూ ఉంటారు.
22) కొరియోగ్రాఫర్లు
వీరు సినిమాలో డాన్స్ చేసే హీరో హీరోయిన్లకు ఇతర నటీనటులకు డాన్స్ స్టెప్స్ కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు.
23)జూనియర్ ఆర్టిస్టులు
సినిమాలో ఆర్టిస్టులు అందరూ తెలిసిన వారే ఉంటారు. కానీ జూనియర్ ఆర్టిస్టులు మాత్రం ఇలా వచ్చి అలా మాయం అవుతూ ఉంటారు. కానీ ఫ్రేమ్ నిండుగా ఉండాలంటే వీరు కచ్చితంగా ఉండాల్సిందే.
24) డైరెక్టర్
దర్శకుడు మిగతా 23 విభాగాలను కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ఆయనను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని పిలుస్తారు.
Also Read: Vicky Kaushal Filmfare Award: ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న విక్కీ కౌశల్ కు కత్రినా ముద్దుల వర్షం
Also Read: Cobra Movie Review: విక్రమ్ నటించిన కోబ్రా మూవీ ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి