Septemeber Vrat-Festival list 2022: ఈ రోజు నుంచే సెప్టెంబర్ నెల మొదలైంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం భాద్రపద మాసం కొనసాగుతోంది. సెప్టెంబర్ 10 నుంచి అశ్విణీ మాసం ప్రారంభం కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో (Septemeber Month Festivals 2022) కొన్ని ముఖ్యమైన పండుగలు, వ్రతాలు రానున్నాయి.
ఈ నెలలో రానున్న వ్రతాలు, పండుగలు ఇవే..
01 సెప్టెంబర్ (గురువారం) - ఋషి పంచమి, లలితా షష్ఠి
ఋషి పంచమి - ఈ రోజున ఏడుగురు ఋషులను పూజిస్తారు. పాపాల నుంండి విముక్తి పొందడానికి ఈ ఋషి పంచమి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం స్త్రీల రుతుక్రమానికి సంబంధించినది.
02 సెప్టెంబర్ (శుక్రవారం) - సూర్య షష్ఠి, సంతాన సప్తమి, బడి శతం
సంతాన సప్తమి - భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో ఏడవ రోజున సంతాన సప్తమి వ్రతం జరుపుకుంటారు. ఈ రోజున స్త్రీలు ఉపవాసం ఉండి శివుడిని, పార్వతిని పూజిస్తారు. ఈ వ్రతాన్ని పిల్లల శ్రేయస్సు, ఆనందం కోసం చేస్తారు.
03 సెప్టెంబర్ (శనివారం) - మహాలక్ష్మి వ్రతం
మహాలక్ష్మీ వ్రతం - భాద్రపద శుక్ల అష్టమి తిథి నుండి మహాలక్ష్మీ వ్రతం ప్రారంభమవుతుంది. ఇది పదహారు రోజులు పాటు ఉంటుంది. ఈ వ్రతంలో లక్ష్మిదేవిని పూజిస్తారు.
04 సెప్టెంబర్ (ఆదివారం) - శ్రీ రాధాష్టమి
రాధాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి తర్వాత 15 రోజుల తర్వాత శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ పుట్టినరోజు జరుపుకుంటారు. ఈ రోజున రాధతోపాటు కన్నయ్యను పూజిస్తారు.
06 సెప్టెంబర్ (మంగళవారం) - పరివర్తిని ఏకాదశి
పరివర్తినీ ఏకాదశి - ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుంది.
07 సెప్టెంబరు (బుధవారం) - డోల్గ్యారస్, జల్ఝుల్ని ఏకాదశి
డోల్ గ్యారస్ - కృష్ణ జన్మాష్టమి తర్వాత వచ్చే ఏకాదశిని డోల్ గ్యారస్ అంటారు. దీనిని పరివర్తినీ ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, పద్మ ఏకాదశి, జలజుల్ని ఏకాదశి మరియు వామన ఏకాదశి అని కూడా అంటారు.
08 సెప్టెంబర్ (గురువారం) - భాదో శుక్ల ప్రదోష వ్రతం
09 సెప్టెంబర్ (శుక్రవారం) - అనంత చతుర్దశి, గణపతి నిమజ్జనం
అనంత చతుర్దశి - 10 రోజుల గణేష్ పండుగ అనంత చతుర్దశి నాడు ముగుస్తుంది. ఈ రోజున గణపతిని నిమజ్జనం చేస్తారు.
సెప్టెంబర్ 10 (శనివారం) - పితృ పక్షం ప్రారంభం, శ్రాద్ధం ప్రారంభం, పూర్ణిమ ఉపవాసం
పితృ పక్షం - భాద్రపద పూర్ణిమ మరియు ఆశ్విన మాసంలోని కృష్ణ పక్షం యొక్క ప్రతిపద పితృ పక్షం. ఇందులో ప్రజలు తమ పూర్వీకుల కోసం తర్పణం, పిండదానం చేస్తారు.
సెప్టెంబర్ 13 (మంగళవారం) - సంకష్టి చతుర్థి వ్రతం
సంకష్టి చతుర్థి - ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి నాడు సంకష్టి చతుర్థి వ్రతం పాటిస్తారు. ఈ రోజు వినాయకుడిని పూజిస్తారు.
17 సెప్టెంబర్ (శనివారం) - కన్యా సంక్రాంతి, అశోకాష్టమి
కన్యా సంక్రాంతి- సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశికి మారడాన్నే సంక్రాంతి అంటారు. సూర్యభగవానుడు కన్య రాశిలోకి ప్రవేశించడాన్నే కన్యా సంక్రాంతి అంటారు.
21 సెప్టెంబర్ (బుధవారం) - ఇంద్ర ఏకాదశి
23 సెప్టెంబర్ (శుక్రవారం) - అశ్విణీ మాస ప్రదోష వ్రతం (కృష్ణ పక్షం)
అశ్విణీ మాస ప్రదోష వ్రతం - ప్రదోష వ్రతంలో మహాదేవుని పూజిస్తారు. దీంతో కోరిన కోరికలు తీరుతాయి.
సెప్టెంబర్ 24 (శనివారం) - నెలవారీ శివరాత్రి
నెలవారీ శివరాత్రి - శివరాత్రి శివుడికి అంకితం చేయబడింది. ఈ రోజు రాత్రిపూట జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తారు.
25 సెప్టెంబర్ (ఆదివారం) - సర్వ పితృ అమావాస్య, శ్రాద్ధం ముగుస్తుంది
సర్వ పితృ అమావాస్య - సర్వ పితృ అమావాస్య రోజున శ్రాద్ధం మరియు తర్పణం చేయడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుంది.
26 సెప్టెంబర్ (శుక్రవారం) – శారద నవరాత్రులు ప్రారంభం, ఘటస్థాపన
శారద నవరాత్రి - సెప్టెంబర్ నెలలో నవరాత్రులు సెప్టెంబర్ 26 నుండి ప్రారంభంకానున్నాయి. నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు.
Also Read: Astro Tips: మీ దురదృష్టం కూడా అదృష్టంగా మారాలంటే...రోజూ ఈ 5 పనులు చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook