KWK 7: విమానంలో సెక్స్‌కు ప్రయత్నించి..పట్టుబడి పోయిన కరణ్ జోహార్

KWK 7: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే. కాఫీ విత్ కరణ్ 7లో విమానంలో సెక్స్ చేసేందుకు ప్రయత్నించానంటూ కరణ్ జోహర్ సంచలనం రేపాడు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 1, 2022, 10:31 PM IST
KWK 7: విమానంలో సెక్స్‌కు ప్రయత్నించి..పట్టుబడి పోయిన కరణ్ జోహార్

KWK 7: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే. కాఫీ విత్ కరణ్ 7లో విమానంలో సెక్స్ చేసేందుకు ప్రయత్నించానంటూ కరణ్ జోహర్ సంచలనం రేపాడు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లో ఉండే నిర్మాతగా కరణ్ జోహార్‌కు పేరుంది. అత్యంత ప్రజాదరణ పొందిన చాట్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో తన జీవితంలోని ఒక షాకింగ్ ఘటన గురించి ప్రస్తావించి సంచలనమయ్యాడు. ఇటీవల జరిగిన ఈ షోలో టైగర్ ష్రాఫ్, కృతి సనన్ పాల్గొన్నారు. వాస్తవానికి ఇద ప్రశ్నను కరణ్ జోహార్..టైగర్ ష్రాఫ్‌తో అడిగాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు కరణ్ జోహార్. ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా..రిలేషన్ గడిపిన అత్యంత విచిత్రమైన లేదా విభిన్నమైన ప్రదేశమేదని టైగర్ ష్రాఫ్‌ను అడిగాడు కరణ్ జోహార్. ఇది విచిత్రం కాదు కానీ..గాలిలో ఎత్తైన ప్రదేశంల అలా చేయడం కాస్త అడ్వెంచరస్ అని టైగర్ ష్రాఫ్ చెప్పాడు. 

దీనిపై కరణ్ జోహార్ స్పందించాడు. ఎయిర్ క్రాఫ్ట్‌లో సెక్సే చేసే గ్రూపులో నువ్వు కూడా సభ్యుడివా..జనాలు ఎలా చేస్తారో అర్ధం కాదు..షో తరువాత నేను దీనిపై చాట్ చేస్తాను. నేను కూడా ఓసారి ఇలా ప్రయత్నించాను. కానీ కుదరలేదు. పట్టుబడిపోయాను. అప్పుడు నా పరిస్థితి చాలా విచిత్రంగా ఉందంటూ కరణ్ జోహార్ బదులిచ్చాడు. 

జీవిత భాగస్వామిని వెతికేందుకు ఇప్పుడు సమయం మించిపోయిందని కరణ్ జోహార్ తెలిపాడు. నా జీవితంలో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఆ ఖాళీని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పాడు. 

Also read: SSMB28 Shooting Update: ఆ సీన్‌తోనే SSMB28 షూటింగ్ ఆరంభం.. కసరత్తులు మొదలెట్టిన మ‌హేశ్ బాబు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News