Never Mix Alcohol with Soda : మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా మద్యం ప్రియుల చెవికెక్కదు. మద్యం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసి కూడా తాగేస్తుంటారు. ఈ విషయం పక్కనపెడితే.. మద్యం తాగడమే హానికరమైతే, దాన్ని సోడా లేదా కూల్ డ్రింక్స్‌తో కలిపి తాగడం మరింత హానికరం. ఆల్కాహాల్‌తో సోడా లేదా కూల్ డ్రింక్ మిక్స్ చేసి తాగితే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.
ఆల్కాహాల్ సోడా మిక్స్ :
చాలామంది ఆల్కాహాల్‌లో సోడా కలుపుకుని తాగుతుంటారు. అయితే ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఈ రెండు మిక్స్ చేసిన డ్రింక్ త్వరగా రక్తంలో కలిసిపోయి తొందరగా మత్తెక్కుతుంది. సోడాలో ఉండే పాస్పరిక్ యాసిడ్ శరీరంలో కాల్షియంను తగ్గిస్తుంది. దాంతో ఎముకలు బలహీనపడటం, ఎముకల్లో పగుళ్లు వంటి సమస్యలు రావొచ్చు. కాబట్టి ఆల్కహాల్‌లో సోడాను మిక్స్ చేసి తాగొద్దు.
ఆల్కాహాల్ కూల్ డ్రింక్స్ :
కొంతమంది ఆల్కాహాల్‌లో కూల్ డ్రింక్స్ మిక్స్ చేసి తాగుతారు. ఇది కూడా మంచిది కాదు. కూల్ డ్రింక్స్‌లో కెఫిన్ ఉంటుంది. ఇది శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. అదే సమయంలో ఆల్కాహాల్ శరీరాన్ని నీరసించేలా చేస్తుంది. ఈ రెండు డ్రింక్స్‌ను కలిపి తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్కాహాల్‌లో కూల్ డ్రింక్స్‌ను మిక్స్ చేసి తాగొద్దు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook