Tata Blackbird: అద్భుతమైన కళ్లు చెదిరే డిజైన్‌తో టాటా మిడ్ ఎస్‌యూవీ బ్లాక్‌బర్డ్ లాంచ్, ప్రత్యేకతలేంటి, ఎందుకు తీసుకోవాలి

Tata Blackbird: భారత ఆటోమోటివ్ మార్కెట్ ఎస్‌యూవీ విభాగంలో టాటా మోటార్స్ దూసుకుపోతోంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీగా టాటా కంపెనీ లాంచ్ చేసిన బ్లాక్‌బర్డ్ చూపరుల్ని అదే పనిగా ఆకట్టుకుంటోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 4, 2022, 04:55 PM IST
Tata Blackbird: అద్భుతమైన కళ్లు చెదిరే డిజైన్‌తో టాటా మిడ్ ఎస్‌యూవీ బ్లాక్‌బర్డ్ లాంచ్, ప్రత్యేకతలేంటి, ఎందుకు తీసుకోవాలి

Tata Blackbird: భారత ఆటోమోటివ్ మార్కెట్ ఎస్‌యూవీ విభాగంలో టాటా మోటార్స్ దూసుకుపోతోంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీగా టాటా కంపెనీ లాంచ్ చేసిన బ్లాక్‌బర్డ్ చూపరుల్ని అదే పనిగా ఆకట్టుకుంటోంది. 

టాటా మోటార్స్ చాలా వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. కస్టమర్ అభిరుచికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుండయ్ క్రెటా చాలా ప్రాచుర్యం పొందడమే కాకుండా బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఇప్పుడు టాటా కంపెనీ పోటీగా అద్భుతమైన, కళ్లు చెదిరే డిజైన్‌తో మిడ్ సైజ్ ఎస్‌యూవీ టాటా బ్లాక్‌బర్డ్ లాంచ్ చేసింది. టాటా లాంచ్ చేసిన బ్లాక్‌బర్డ్ కేవలం హ్యుండయ్ క్రెటాకే కాకుండా.. ఇతర ఎస్‌యూవీలైన కియా సెల్టాస్, వోక్స్ వేగన్ టైగున్, స్కోడా కుషక్‌లకు పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతం మిడ్ సైజ్ ఎస్‌యూవీ మార్కెట్ చాలా బాగుంది. క్రెటా కంటే టాటా బ్లాక్‌బర్డ్ ఎందుకు ఎంచుకోవాలో ఐదు కారణాలు తెలుసుకుందాం..

టాటా బ్లాక్‌బర్డ్ డిజైన్ అత్యద్భుతం. పొడుకు 4.3 మీటర్లు కాగా ప్రోజెక్టర్ హెడ్ లైట్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, స్మార్ట్ డ్యూయల్ కట్ అల్లాయ్ వీల్స్, ప్రీమియం క్రోమ్ ఎలిమెంట్స్ ఇతర ప్రత్యేకతలు. డిజైన్‌లో కొత్తదనం స్పష్టంగా చూడవచ్చు. క్రెటా అవుట్‌డేటెడ్ కావడంతో..టాటా బ్లాక్‌బర్డ్ అనువైన ఎంపిక కానుంది. 

టాటా మోటార్స్ వాహనాలన్నీ స్ట్రాంగ్ బాడీతో ఉండటమే కాకుండా..క్రాష్ పరీక్షల్లో టాప్ రేటింగ్స్ సాధిస్తుంటాయి. టాటా బ్లాక్‌బర్డ్ బాడీ ఇంకా పటిష్టంగా ఉందని తెలుస్తోంది. అంటే సేఫ్టీపరంగా టాటా బ్లాక్‌బర్డ్ ఎంపిక మంచి నిర్ణయం కాగలదు. 

టాటా బ్లాక్‌బర్డ్ పొడుగు 4.3 మీటర్లు కావడంతో ఇంటీరియర్ స్పేస్ చాలా బాగుంటుంది. క్రెటాతో పోలిస్తే..స్పేస్ ఎక్కువే. బూట్‌స్పేస్ కూడా చాలా అనువుగా ఉంటుంది. 

టాటా బ్లాక్‌బర్డ్‌లో ఫీచర్లు కూడా అద్భుతమే. నాలుగు కంటే ఎక్కువ స్పీకర్లతో టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ కలిగి ఉంటుంది. సన్‌రూఫ్ కూడా పెద్దదిగా ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎమ్, ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్సు, సీట్ వెంటిలేషన్, పుష్ బటన్ స్టార్ట్ వంటి ప్రత్యేకతలున్నాయి.

టాటా బ్లాక్‌బర్డ్ రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రెల్ ఇంజన్ కలిగి ఉంది. అదే సమయంలో డీజిల్ వెర్షన కూడా అందుబాటులో ఉంది. 

Also read: Tata Group: త్వరలో టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ ఐపీవో విడుదల, ఇన్వెస్టర్లకు మంచి అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News