Jivitputrika Vrat 2022: జీవితపుత్రిక వ్రతం ఎప్పుడు? దీనిని ఎందుకు జరుపుకుంటారు?

Jitiya Vrat 2022 Date: జీవితపుత్రిక వ్రతం పిల్లల దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం వివాహిత స్త్రీలు ఆచరిస్తారు. ఈ ఏడాది ఈ వ్రతం సెప్టెంబర్ 18న వస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2022, 09:40 AM IST
Jivitputrika Vrat 2022: జీవితపుత్రిక వ్రతం ఎప్పుడు? దీనిని ఎందుకు జరుపుకుంటారు?

Jivitputrika Vrat 2022 Date Puha Muhurat:  హిందూమతంలో తల్లులు తమ పిల్లల దీర్ఘాయిష్షు మరియు మంచి జీవితం కోసం జీవితపుత్రిక వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతాన్నే జితియా, జియుతియా మరియు జుతియా వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని ఆశ్వినీ మాసంలోని కృష్ణపక్ష అష్టమి నాడు ఆచరిస్తారు. ఈ ఏడాది ఈ ఉపవాసం (Jivitputrika Vrat 2022) సెప్టెంబర్ 18న వస్తుంది. ఈ వ్రతాన్ని ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ మొదలైన రాష్ట్రాల్లో పాటిస్తారు. ఇది మధ్య భారతదేశంలో ఆచరించే సంతాన సప్తమి వ్రతాన్ని పోలి ఉంటుంది. 

జీవితపుత్రిక వ్రతం శుభ ముహూర్తం
హిందూ క్యాలెండర్ ప్రకారం, అశ్వినీ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి 18 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభమై 19 సెప్టెంబర్ 2022న ముగుస్తుంది. కాబట్టి జితియా లేదా జీవితపుత్రిక వ్రతం సెప్టెంబర్ 18న పాటిస్తారు. అయితే పారణ మాత్రం సెప్టెంబర్ 19న జరుగుతుంది. 

వ్రత విధానం
జీవితపుత్రిక లేదా జితియా ఉపవాసానికి ఒకరోజు ముందు స్త్రీలు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరిస్తారు. ఆ తరువాత పూజ చేసి భోజనం చేస్తారు. దీని తర్వాత రోజంతా నిర్జలా ఉపవాసంగా ఉండండి. శుభ సమయంలో పూజలు చేయండి. ఈ ఉపవాసం యొక్క మూడవ రోజు ఉదయం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మాత్రమే మహిళలు ఉపవాసం విరమిస్తారు. 

Also Read: Guru Vakri 2022: మీనంలో త్రికోణ రాజయోగం... ఈ 3 రాశులవారికి అంతులేని ధనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News