Food Habits: మెరుగైన ఆరోగ్యం కావాలంటే..ఆహారపు అలవాట్లు బాగుండాలి. కొన్ని రకాల ఆహార పదార్ధాల విషయంలో ఎప్పుడు తినాలనే స్పష్టత అవసరం. లేకపోతే లేనిపోని అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి.
రోజూ తినే ఆహార పదార్ధాలు లేదా తీసుకునే ద్రవ పదార్ధాలు ఆరోగ్యంపై పూర్తి ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వైద్య నిపుణుల ప్రకారం కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని కొన్ని సమయాల్లో తీసుకోకూడదు. ముఖ్యంగా పరగడుపున అన్ని రకాల ఆహారాన్ని తీసుకోకూడదు. ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉండటంతో.. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపులోపలి భాగాలపై ప్రభావం పడుతుంది. ఫలితంగా కడుపులో మంట, కడుపు నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం వేళ పరగడుపున ఏయే పదార్ధాలు తినకూడదో తెలుసుకుందాం.
ఉదయం వేళల్లో మసాలా లేదా ఫ్లైడ్ పదార్ధాలు తినకూడదు. దీంతో కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. ఫైబర్ పదార్ధాలు కడుపుకి మంచివే. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం చేకూరుస్తాయి. ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే ఫైబర్ పదార్ధాలు తీసుకోవాలి.
కొంతమంది ఉదయం వేళ అంటే పరగడుపున కాఫీ లేదా టీ తాగుతుంటారు. కానీ దీనివల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. కానీ చల్లని నీల్లు అస్సలు తాగకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు ఎదురై..ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది.
ఇక మరి కొంతమందైతే ఉదయం లేచిన వెంటనే మద్యం తాగుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ప్రమాదకరం. ఇది నేరుగా మీ లివర్‌పై ప్రభావం చూపిస్తుంది. మీ రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపించి..సమస్యలకు కారణమౌతుంది.
Also read: Uric Acid: ఈ పదార్ధాలు తీసుకుంటే..ప్రమాదకర యూరిక్ యాసిడ్ నుంచి ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook