Karwa Chauth Vrat 2022: హిందూ స్త్రీలు కర్వా చౌత్ వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు. భర్త దీర్ఘాయుష్షు, అఖండ ఐశ్వర్యం, సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం వివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని పాటిస్తారు. ఈ వ్రతం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం కర్వా చౌత్ వ్రతం (Karwa Chauth Vrat 2022) 13 అక్టోబర్ 2022 న జరుపుకోనున్నారు. ఈ ఏడాది కర్వా చౌత్ నాడు చాలా శుభప్రదమైన యాదృచ్చికం ఏర్పడబోతుంది.
కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి అనగా కర్వా చౌత్ అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై 13వ తేదీ అర్ధరాత్రి 03:09 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం తిథి ఆధారంగా ఈ వ్రతాన్ని అక్టోబర్ 13న జరుపుకుంటారు. ఈ రోజున కృత్తిక నక్షత్రం సాయంత్రం 06:41 నిమిషాల వరకు ఉంటుంది. అనంతరం రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. కర్వా చౌత్ రోజున చంద్రుడిని పూజించి అర్ధార్పణ చేస్తారు. ఈ రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు. వృషభ రాశి మరియు రోహిణి నక్షత్రాలలో చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉండటం చాలా శుభప్రదం. ఈ సమయంలో చేసే పూజలు చాలా శుభ ఫలితాలను ఇస్తాయి. కర్వా చౌత్ రోజున తల్లి పార్వతిని పదహారు వస్తువులతో అలంకరించి నిర్జలా ఉపవాసం చేస్తూ పూజలు చేస్తారు. రాత్రి చంద్రుడిని పూజించి... ఆ తర్వాత ఉపవాసం విరమిస్తారు.
Also Read: Indira Ekadashi 2022: ఇందిర ఏకాదశి వ్రతం ఎప్పుడు? ఈ వ్రత విశిష్టత ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook