గురువారం నాడు బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ ఎడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి. అయితే ఆ ప్రమాణ స్వీకారాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పిటీషను ఫైల్ చేసింది. ఆ పిటీషన్ హియరింగ్ ఈ రోజు ఎలాంటి రాజకీయ మార్పులకు నాంది పలకనుందో వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో ఎడ్యూరప్ప ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు తన మెజారిటీకి సంబంధించి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఎడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ "ప్రజాస్వామ్యాన్ని కాపాడండి" అంటూ నిరసనకు పిలుపునిచ్చింది. కర్నాటక గవర్నర్ వాజుభాయి వాలా నైతిక విలువలకు భంగం కలిగిస్తూ.. ఎడ్యూరప్పను ప్రభుత్వం నెలకొల్పడానికి ఆహ్వానించారని ఆరోపించింది. తాజాగా సుప్రీంకోర్టులో బీజేపీ తరఫున వాదించబోతున్న న్యాయవాది ముకుల్ రోహత్గి మాట్లాడుతూ.. తమ వద్ద మెజారిటీకి సంబంధించిన లేఖలు ఉన్నాయని.. వాటిని కోర్టులో చూపిస్తామని తెలిపారు.
Spoke to our former Prime Minister Shri HD Deve Gowda Ji and conveyed birthday wishes to him. I pray for his good health and long life, tweets Prime Minister Narendra Modi. (File Pics) pic.twitter.com/dy1g50lFP1
— ANI (@ANI) May 18, 2018
ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ఆయా పార్టీలు హైదరాబాద్కి తరలించిన విషయం తెలిసిందే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ రోజు జేడీఎస్ నేత హెచ్ డీ దేవెగౌడ జన్మదినం. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయమే భారత ప్రధాని నరేంద్ర మోదీ, దేవెగౌడకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారట. ఈ సందర్భంగా మోదీ, దేవెగౌడ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ట్వీట్ కూడా చేశారు. ఇప్పటికే సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మాలానీ కర్ణాటక రాజకీయ పరిస్థితులపై సుప్రీంకోర్టులో పిటీషన్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.
Karnataka Congress MLAs arrive at #Hyderabad's Taj Krishna Hotel, Telangana Pradesh Congress Committee (TPCC) head Uttam Kumar Reddy also present. pic.twitter.com/BTSwh4qtmU
— ANI (@ANI) May 18, 2018