Jeera Water For Diabetic Patients: జీలకర్ర గింజలు చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వీటి వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. భారతీయులు వీటిని ఎక్కువగా ఆహారాల రుచిని పెంచేందుకు వినియోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి శరీరానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియ వ్యవస్థను బలంగా చేసేందుకు కృషి చేస్తాయి. అయితే వీటితో చేసిన డ్రింక్ వికారం వంటి వ్యాధులకు ఇది ఔషధంగా పని చేస్తుంది. కాబట్టి పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటితో తయారు చేసిన ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పొట్ట సమస్యలైనా మలబద్ధకం, వికారం వంటి వ్యాధులకు చెక్ పెట్టడమేకాకుండా పెరుగుతున్న శరీర బరువును కూడా సులభంగా నియంత్రింస్తుంది. అయితే ఈ జీలకర్రను ఎలా వినియోగించడం వల్ల బరువు తగ్గుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం...
ఈ అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది:
1. పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
ఈ జీలకర్రను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలైనా మలబద్ధకం, వికారం వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే మూలకాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాబట్టి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఉదయం ఈ డ్రింక్‌ను తీసుకోవాలి. ఇందులో కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్, కొవ్వును విచ్ఛిన్నం చేసే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి పొట్ట సమస్యలను సులభంగా నియంత్రిస్తాయి.
2. మధుమేహంతో బాధపడుతున్నారా..?:
మధుమేహం వ్యాధిగ్రస్తులకు జీలకర్ర నీరు చాలా మేలు చేస్తుంది. ఇందులో శరీరంలో కరిగే హైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు సహాయపడతాయి. అయితే దీనిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది.
3. చర్మాని చాలా రకాలుగా మేలు చేస్తుంది:
జీలకర్ర చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల చర్మంపై గ్లో వస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో పొటాషియం, కాల్షియం, సెలీనియం, కాపర్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేయడమే కాకుండా చర్మంపై సమస్యలకు కూడా చెక్ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం.. పసుపులో జీలకర్ర నీరు కలిపి అది ఫేస్ ప్యాక్‌ల వినియోగిస్తే చాలు అన్ని చర్మ సమస్యలు దూరమవుతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Jeera Water Benefits: జీలకర్రతో చేసిన ఈ డ్రింక్ రోజూ తీసుకుంటే చాలు.. కేవలం 22 రోజుల్లో మధుమేహం తగ్గడం ఖాయం..
జీలకర్రతో చేసిన డ్రింక్ రోజూ తాగితే..
పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
చర్మాని చాలా రకాలుగా మేలు చేస్తుంది.