Google photos app: అమెరికా టెక్ దిగ్గజం గూగుల్..ఫోటో యాప్‌లో సరికొత్త అప్‌డేట్ ప్రవేశపెడుతోంది. రెండేళ్ల తరువాత గూగుల్ అందిస్తున్న కీలకమైన అప్‌డేట్‌గా తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ నుంచి కొత్త అప్‌డేట్ అందుతోంది. ఫోటో మెమరీకు సంబంధించి ఇది కీలకమైన అప్‌డేట్. మెమరీస్ అనేది చాలా ప్రాచుర్యంలో ఉన్న ఫీచర్. ప్రతి నెలా 3.5 బిలియన్ల కంటే ఎక్కువగా వీక్షిస్తుంటారు. ఇప్పుడీ ఫీచర్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది గూగుల్.
ఫోటోలు, వీడియోలు కలిపి పెద్ద వీడియో తయారు చేస్తోంది. మెమరీలో ఫోటో ఇప్పుడు ఎక్కువ ప్రభావవంతంగా ఉండనుంది. జూమ్ ఇన్ లేదా జూమ్ అవుట్ కూడా చేయవచ్చు. దాంతోపాటు యూజర్లు ఇప్పుడు మరో ఫోటో యూజర్‌తో మెమరీ పంచుకోవచ్చు. వెబ్‌లింక్, ఐవోఎస్‌తో కూడా మెమరీ షేర్ చేసుకునే అవకాశం త్వరలో రానుంది.
మీ మెమరీను మరింత డైనమిక్‌గా చేసేందుకు మరో విధానం ప్రవేశపెట్టనుంది. గూగుల్ ఫోటో యాప్ మీకు సంబంధించిన ఒక 3డి మోడల్ తయారు చేస్తుంది. ఇది సినిమాటిక్ ఫోటోస్‌తో కలిపి సంపూర్ణమైన ఎండ్ టు ఎండ్ వీడియోను అందిస్తుంది. ఇది కాకుండా కొత్తగా కొలాజ్ ఎడిటర్ ఆప్షన్ వస్తోంది. యూజర్లు తమ కోలాజ్‌ను విభిన్న కోణాల్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఫోటోను అటూ ఇటూ చేయవచ్చు. బ్యాక్ గ్రౌండ్ కూడా ఎంచుకోవచ్చు.
Also read: Bullish Stock: నెల రోజుల్లో రెట్టింపైన షేర్లు, ఇన్వెస్టర్లకు డబుల్ బొనాంజా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok