Shukra Rashi Parivartan 2022: దేవతల గురువైన శుక్రాచార్యుడు... ప్రేమ, శృంగారం, లగ్జరీ లైఫ్, అందానికి కారకుడిగా భావిస్తారు. అలాంటి శుక్రుడు ఈ నెల 24వ తేదీన కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ సమయంలో ఆ రాశిలో అప్పటికే సూర్యుడు, బుధుడు ఉంటారు. కన్యారాశిలో శుక్ర సంచారం (Venus Transit in Virgo 2022) మెుత్తం 12 రాశులవారిపై మంచి, చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ శుక్ర సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
శుక్ర సంచారం ఈ రాశులవారికి శుభప్రదం
వృషభం (Taurus): డబ్బు, గౌరవం పొందుతారు
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి శుక్ర సంచారం వృషభ రాశి వారికి విశేష ప్రయోజనాలను ఇస్తుంది. ఈ రాశివారు జీవితంలోని అన్ని సమస్యల నుండి బయటపడతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇరుక్కుపోయిన డబ్బు మీ వద్దకు వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మిథునం (Gemini): ధనలాభం ఉంటుంది
శుక్రుడు రాశి మార్పు మిథున రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. వారి వ్యాపారం విస్తరిస్తుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆస్తి దొరుకుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మీరు సంతోషంగా మరియు సుఖంగా ఉంటారు.
కన్య (Virgo): పెట్టుబడికి మంచి సమయం
శుక్ర గ్రహం స్వయంగా కన్యా రాశిలోకి ప్రవేశిస్తుంది, కాబట్టి ఈ రాశివారిపై శుక్ర సంచారం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు శుభ ఫలితాలను పొందుతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. పాత ఆస్తి నుంచి లాభం పొందుతారు. పెట్టుబడికి కూడా ఇదే మంచి సమయం. వ్యాపారం పెరుగుతుంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
Also Read: Shani Mahadasha: శని మహాదశ అంటే ఏమిటి, దాని ప్రయోజనాలు, నష్టాలు, పరిహారాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook