Navratri 2022: నవరాత్రుల్లో ఎందుకు ఉల్లిపాయ, వెల్లుల్లిని తినొద్దు..?

Navratri 2022 Food Items: ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రుల్లో భాగంగా హిందువులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. అయితే ఈ సంవత్సరం శరన్నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకు తొమ్మిది రోజులపాటు జరగనున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 23, 2022, 04:44 PM IST
  • సెప్టెంబర్ 26 శరన్నవరాత్రులు
  • నవరాత్రుల్లో ఉల్లిపాయలు తినొచ్చా..
  • అసలు ఎందుకు తినొద్దు
Navratri 2022: నవరాత్రుల్లో ఎందుకు ఉల్లిపాయ, వెల్లుల్లిని తినొద్దు..?

Navratri 2022 Food Items: ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రుల్లో భాగంగా హిందువులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. అయితే ఈ సంవత్సరం శరన్నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకు తొమ్మిది రోజులపాటు జరగనున్నాయి. అయితే ఈ తొమ్మిది రోజుల్లో భాగంగా హిందువులంతా ఐదు రోజులపాటు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తారు. అంతేకాకుండా తొమ్మిది రోజుల్లో చివరిరోజున విజయదశమిగా జరుపుకుంటారు. అయితే ఈ క్రమంలో అమ్మవారి అనుగ్రహం పొందాలంటే పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. మొదటి నియమం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే.. రెండో నియమం 9 రోజులు భక్తి శ్రద్ధలతో ఉండడం. అంతేకాకుండా నవరాత్రుల్లో తీసుకునే ఆహారంలో కూడా పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నవరాత్రుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి తినొచ్చా..?

పూర్వీకులు నవరాత్రుల్లో వెల్లుల్లిని తినకూడదని చెబుతూ ఉంటారు. దీంతో భారతీయులు పలు ప్రాంతాల్లో నవరాత్రి పూజలు చేసే క్రమంలో వెల్లుల్లి తినేందుకు ఇష్టపడరు. అంతేకాకుండా వీటిని ఎక్కువగా మాంసాహారాల్లో వినియోగిస్తారు. కాబట్టి పూర్వీకులు వీటిని తినేవారు కాదు.

శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని పూజించి భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజులు పాటు ఉంటే.. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలో కేవలం ఉపవాసాలు పాటించేవారు.. అల్లం వెల్లుల్లి ఉపయోగించని ఆహారాలు తీసుకుంటే చాలా మంచిదని శాస్త్రం పేర్కొంది. కాబట్టి వీరు పండ్లు, పాలు, గింజలు వంటి ఆహారాలను తీసుకుంటే శరీరం యాక్టివ్ గా ఉండటమే కాకుండా ఉపవాసం నియమం కూడా పూర్తవుతుంది.

అయితే వెల్లుల్లిని సంవత్సరం పొడుగునా వాడినా కేవలం నవరాత్రుల్లో భాగంగా చాలామంది తినేందుకు ఇష్టపడరు. దీనికి ప్రధాన కారణం పైన పేర్కొన్నదేనని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని వినియోగించకుండా ఆహారాలను వండుకుంటే శరన్నవరాత్రుల్లో ఉపవాసాలు పలుస్తాయని వారు చెబుతున్నారు. కాబట్టి 9 రోజుల పాటు జరిగే శరన్నవరాత్రుల్లో వెల్లుల్లిని అసలు వినియోగించారు.

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News