AP Tourism Sector: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో భారీ ప్రాజెక్టులు రానున్నాయి. 11 అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమౌతున్నాయి. యూరప్ ఎక్స్‌పో 2022 వివరాలివీ..
యూరోప్ ఎక్స్‌పో 2022లో ఏపీ భారీ ప్రాజెక్టులు కైవసం చేసుకుంది. ఏకంగా 550 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. 11 అంతర్జాతీయ కంపెనీలు ఏపీ పర్యాటకరంగంలో పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రిక్రియేషన్ హబ్‌గా మారేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి. సెప్టెంబర్ 12-15 వరకూ లండన్‌లో యూరోప్ ఎక్స్‌పో 2022 జరిగింది. ఈ వేదిక ఆధారంగా అద్భుతమైన అవకాశాలు లభించాయి.
ఏపీలో రానున్న పెట్టుబడుల వివరాలు
స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటామిన్ వరల్డ్‌వైడ్ సంస్థ విశాఖపట్నంలో వందకోట్ల పెట్టుబడిలో జాయింట్ వెంచర్‌గా స్కై టవర్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టనుంది. ఎమ్యూజ్‌మెంట్ రైడ్స్, మోనోరైల్స్ తయారీలో ఈ సంస్థకు పేరుంది. తిరుపతిలో మోనోరైల్ ప్రాజెక్టుకు ఆసక్తి కనబర్చింది.
టర్కీకు చెందిన పోలిన్ గ్రూప్ విశాఖపట్నంలో వందకోట్ల పెట్టుబడులతో టన్నెల్ ఎక్వేరియం నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది.
జర్మనీకు చెందిన హస్స్ పార్క్ ఎట్రాక్షన్స్..ఎమ్యూజ్‌మెంట్ పార్క్స్ నెలకొల్పేవారికి కావల్సిన సామగ్రి సరఫరా చేయనుంది.
కెనడాకు చెందిన ఏరోడియమ్ గండికోటలో స్కై డైవింగ్ ప్రాజెక్టుకు ఆసక్తి కనబర్చింది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరోఫైల్ సంస్థ..అరకు వ్యాలీలో ఒకేసారి 30 మందిని తీసుకెళ్లే గ్యాస్ బెలూన్ ప్రాజెక్టు నెలకొల్పనుంది.
ఇటలీకు చెందిన నీవ్ ప్లాస్ట్ కంపెనీ వింటర్ స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ సమకూర్చనుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఎక్స్టీమ్ వెంచర్స్ ప్రపంచస్థాయి అడ్వెంచర్ పార్క్ స్థాపించనుంది.
టర్కీకు చెందిన డీఓఎఫ్ సంస్థ అధునాతన మీడియా ఆధారిత సిమ్యూలేటర్ల రంగంలో ఫ్లైయింగ్ థియేటర్లు, డోమ్ థియేటర్లు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది. కెనడాకు చెందిన వైట్ వైటర్ వెస్ట్ భారీ వాటర్ పార్క్ ప్రాజెక్టులు నెలకొల్పనుంది.
స్విట్జర్లాండ్‌కు చెందిన ఎట్రాక్షన్ కంపెనీ విశాఖపట్నంలో పలు ప్రాజెక్టులు నెలకొల్పనుంది. ఇందులో కైలాసగిరిలో తెలుగు మ్యూజియం ఒకటి. ఇక ఫ్రాన్స్‌కు చెందిన కాన్సెప్ట్ 1900 కంపెనీ, న్యూజిలాండ్‌కు చెందిన డెల్టా స్ట్రైక్స్ కంపెనీలు పలు అభివృద్ధి ప్రణాలికలతో ముందుకొచ్చాయి.
Also read: AP BJP: ఏపీ బీజేపీలో టీడీపీ కోవర్టులు, బీజేపీ అధిష్టానం ఆగ్రహం, ఆ వ్యక్తే కారణమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
AP Tourism Sector: ఏపీ పర్యాటక రంగానికి విదేశీ కళ, త్వరలో 11 అంతర్జాతీయ ప్రాజెక్టులు