Karwa Chauth 2022: హిందూమతంలో కర్వా చౌత్‌కు విశేష ప్రాధాన్యత ఉంది. వివాహిత మహిళలు..భర్తల సౌభాగ్యం కోసం ప్రతి యేటా కర్వా చౌత్ ఆచరిస్తుంటారు. ఈ ఏడాది కర్వా చౌత్ ఎప్పుడు, ముహూర్త సమయమేదో తెలుసుకుందాం..
హిందూమతంలో కర్వా చౌత్ మహత్యం ఎక్కువ. ఈ పండుగ కార్తీక మాసంలోని కృష్ణపక్షం చతుర్ధి తిధి నాడు జరుపుతారు. మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం కర్వా చౌత్ రోజున నిర్జన వ్రతం ఆచరిస్తారు. చంద్రోదయం తరువాత వ్రతం విడుస్తారు. కర్వా చౌత్ కోసం ఏడాది పొడుగునా మహిళలు నిరీక్షిస్తారు. కర్వా చౌత్ ముహర్తం, ప్రాధాన్యత వివరాలు మీ కోసం..
కర్వా చౌత్ ఎప్పుడు
హిందూ పంచాగం ప్రకారం కార్తీక మాసం చతుర్ధి తిధి నాడు కర్వా చౌత్ ఉంటుంది. ఈసారి ఈ వ్రతం అక్టోబర్ 13 వతేదీన ఉంది. పూజకు అనువైన శుభ ముహూర్తం కూడా ఇదే రోజు. కార్తీక మాసం చతుర్ధి తిధి అక్టోబర్ 13న 1 గంట 59 నిమిషాలకు ప్రారంభమై...అక్టోబర్ 14వ తేదీ ఉదయం 3 గంటల 8 నిమిషాల వరకూ ఉంటుంది. ఉదయ తిధి లెక్కల ప్రకారం అక్టోబర్ 13న జరుపుకుంటారు.
కర్వా చౌత్ నాడు పూజ కోసం అక్టోబర్ 13 వ తేదీ 5 గంటల 54 నిమిషాల నుంచి 7 గంటల 9 నిమిషాల వరకూ శుభ ముహూర్తంగా ఉంది. కర్వా చౌత్ నాడు చంద్రోదయ సమయం రాత్రి 8 గంటల 9 నిమిషాలకుంది.
కర్వా చౌత్ రోజున మహిళలు ఉదయం లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని తయారవుతారు. ఆ రోజున నిర్జల వ్రతం ఆచరిస్తారు. గర్భిణీ మహిళలు లేదా ఆరోగ్య సంబంధ సమస్యలున్నవారు మాత్రం వ్రతం సందర్భంగా పండ్లు తినవచ్చు. రోజంతా వ్రతం ఆచరించి..సాయంత్రం గిన్నెలో నీళ్లు తీసుకుంటారు. ఓ పళ్లెంలో గోధుమలు నింపి పార్వతీ దేవి పూజ చేస్తారు. దాంతోపాటు వ్రతం కధ వింటారు. ఆ తరువాత రాత్రి చంద్రోదయం తరువాత వ్రతం వదులుతారు.
Also read: Dhanteras 2022: ధనత్రయోదశి రోజు ధన్వంతరిని ఇలా పూజిస్తే.. మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook