Ponniyin Selvan Twitter Review: పొన్నియన్ సెల్వన్ తమిళ బాహుబలినా.. తెలుగులో మెగా సర్ప్రయిజ్.. సినిమా చూసిన వాళ్లు ఏమంటున్నారంటే?

Ponniyin Selvan Ps1 Twitter Review: పొన్నియన్ సెల్వన్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.​ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 

Last Updated : Sep 30, 2022, 06:35 AM IST
  • భారీ ఎత్తున విడుదలైన పొన్నియన్ సెల్వన్
  • ప్రేక్షకుల్లో భారీ అంచనాలు
  • ట్విట్టర్లో సినిమాకు మిశ్రమ స్పందన
Ponniyin Selvan Twitter Review: పొన్నియన్ సెల్వన్ తమిళ బాహుబలినా.. తెలుగులో మెగా సర్ప్రయిజ్.. సినిమా చూసిన వాళ్లు ఏమంటున్నారంటే?

 Ponniyin Selvan Ps1 Twitter Review: తమిళ ప్రేక్షకులు తమ బాహుబలిగా భావిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పలు భాషల్లో విడుదలైంది. లవ్ మూవీస్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం డైరెక్షన్ కావడం, ఐశ్వర్యారాయ్, త్రిష, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రలలో నటించడం, విక్రమ్, జయం రవి, కార్తి ప్రధాన పాత్రలలో నటించిన సినిమా కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

వీరు కాకుండా ప్రకాష్ రాజ్, పార్ధీబన్,  జయరామ్, వెంకట్ ప్రభు తదితరులు నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. చోళ సామ్రాజ్య వైభవాన్ని గురించి తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. రెండు భాగాలుగా రూపుదిద్దుకోవాల్సిన ఈ సినిమా మొదటి భాగం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెరికా వంటి చోట్ల కొన్ని షోలు ప్రదర్శితమయ్యాయి.

భారతదేశ కాలమానం ప్రకారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో మొదటి షో పడింది. దీంతో దాదాపు సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ సినిమా ఎలా ఉందో తమ అభిప్రాయాన్ని చెబుతూ ట్విట్టర్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలుగు వర్షన్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారని చెబుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాన్ని ఇప్పటివరకు మేకర్స్ కాస్త రహస్యంగా ఉంచారు.  

ఇక సినిమా చూస్తున్న వారు సినిమా భారీ బ్లాక్ బస్టర్ లాగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఇది ఒక పీరియడ్ ఆక్షన్ ఫిలిం అని ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ ఆకొట్టుకునే విధంగా సినిమా రూపొందించారని అంటున్నారు. స్టోరీ లైన్ బాగుందని మ్యూజిక్ కూడా బాగుందని తెలుస్తోంది. అలాగే విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు. అయితే నేరేషన్ విషయంలో కాస్త ఫ్లాట్ గా అనిపిస్తుందని, ఎమోషనల్ కనెక్ట్ అనేది అనిపించకపోవడం సినిమాకు కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

స్క్రీన్ మీద త్రిష, ఐశ్వర్యారాయ్ ఇద్దరూ అద్భుతంగా కనిపించారని అంటున్నారు. కార్తి, విక్రమ్ సినిమా మొత్తానికి బాగా ప్లస్ అయ్యారని స్క్రీన్ ప్లే విషయంలో ఆయన మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండు అని కామెంట్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ విషయంలో కూడా కాస్త క్వాలిటీ కోసం ట్రై చేసి ఉంటే బాగుండు అనే వాదన వినిపిస్తోంది. మరి కొంతమంది మాత్రం ఫస్ట్ ఆఫ్ బాగా స్లో అనిపిస్తుందని అంటుంటే కొందరు మాత్రం స్లోగా ఉన్నా సరే అద్భుతంగా కుదిరిందని కామెంట్ చేస్తున్నారు.

తమిళ వారంతా ఇది గర్వం పడే ఒక సందర్భమని అక్కడి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ బాగా కుదిరాయని వాదన వాళ్ళు తెరమీదకి తీసుకొస్తున్నారు. అంతేగాక మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తమిళనాడులో ఏర్పాటు చేసిన కొన్ని ఫ్యాన్ షోస్ కి అలాగే ప్రీమియర్ షోస్ కి హాజరయ్యారంటే కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని తమిళ అభిమానులు భావిస్తున్నారు. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

Trending News