TRS VS MIM: పీకే బాటలోనే ఎంఐఎం.. కేసీఆర్ తో దోస్తీ కటీఫ్! 30 నియోజకవర్గాల్లో కారుకు గండం..

TRS VS MIM: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకునిపోయోలా వ్యూహాలు రచిస్తున్నారు. సొంత రాష్ట్రంలో ఆయనకు షాకిచ్చే పరిణామాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Written by - Srisailam | Last Updated : Sep 30, 2022, 12:09 PM IST
  • తెలంగాణలో మరో సంచలనం
  • కేసీఆర్ తో అసద్ దోస్తీ కటీఫ్!
  • ఎంఐఎం పోటీతో కారుకు గండమే..
TRS VS MIM: పీకే బాటలోనే ఎంఐఎం.. కేసీఆర్ తో దోస్తీ కటీఫ్! 30 నియోజకవర్గాల్లో కారుకు గండం..

TRS VS MIM: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకునిపోయోలా వ్యూహాలు రచిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇతర పార్టీల మద్దతు కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుండగా.. సొంత రాష్ట్రంలో ఆయనకు షాకిచ్చే పరిణామాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో తమకు మిత్రపక్షంగా ఉంటున్న మజ్లిస్ పార్టీ.. కేసీఆర్ కు హ్యాండ్ ఇవ్వబోతుందనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో  ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రూటు మార్చబోతున్నారని.. టీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్, బీఎస్పీతో కలిసి నడిచేలా స్కెచ్ వేస్తున్నారని అంటున్నారు.

ఎంఐఎం పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు ఎంపీ అసద్. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో ఎంపీతో పాటు రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. పలు మున్సిపల్ , కార్పొరేషన్లలోనూ సీట్లు సాధించారు. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్ లో ఎంఐఎం ఐదు సీట్లు సాధించింది.  అయితే 2022లో నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు.  కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది.  దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేస్తున్న ఎంఐఎం పార్టీ.. తమ సొంత రాష్ట్రం తెలంగాణలో మాత్రం పాతబస్తీ దాటి పోవడం లేదు. ఓల్డ్ సిటీలోని ఏడు సీట్లలోనే పోటీ చేస్తుంది. తమకు బలమున్నా తెలంగాణలోని మిగితా ప్రాంతాల్లో పతంగి పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదనే ప్రశ్నలు వచ్చాయి. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో లోపాయకారి ఒప్పందంలో భాగంగానే ఎంఐఎం పార్టీ హైదరాబాద్ దాటి బయటికి పోవడం లేదన్న టాక్ ఉంది. మైనార్టీ ఓట్లు చీలకుండా చూస్తూ పరోక్షంగా టీఆర్ఎస్ విజయానికి అసద్ సహకరిస్తున్నారు.  

నిజానికి తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, మున్సిపల్ ప్రాంతాల్లో మైనార్టీ ఓటర్లు భారీగానే ఉన్నారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో  మైనార్టీలు ఉన్నారు. హైదరాబాద్ లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మైనార్టీలే కీలకం. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలోనూ గెలుపోటములను శాసించే స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. నిర్మల్, ముథోల్, నిజామాబాద్ అర్బన్, బోదన్, ఆర్మూరు, కరీంనగర్, మెట్ పల్లి,  జగిత్యాల, నల్గొండ, సంగారెడ్డి, జహీరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భువనగిరి, వరంగల్ , మహబూబ్ నగర్, షాద్ నగర్, గ్రేటర్ పరిధిలోని జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, ఖైరతాబాద్, మహేశ్వరం నియోజకవర్గాల్లో మైనార్టీ ఓటర్ల మద్దతు ఉంటేనే గెలుపు సాధ్యం. వీళ్ల మద్దతులోనే ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెబుతారు.

మైనార్టీలు ఎక్కువన్న అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ లో ఎంఐఎంకు మంచి క్యాడర్ ఉంది. 2014 ఎన్నికల్లో నిజామాబాద్‌లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఎలాంటి ప్రచారం చేయకున్నా 31 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. నిజమాబాద్ కార్పొరేషన్లలో ఎంఐఎం పార్టీ 16 డివిజన్లు గెలిచింది. గత రెండు ఎన్నికల్లో కేసీఆర్ తో డీల్ కారణంగా పాతబస్తీ మినహా ఇతర ప్రాంతాల్లో పోటీ చేయని ఎంఐఎం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 25 నుంచి 30 సీట్లలో పోటీ చేయాలని డిసైడ్ అయిందని అంటున్నారు. ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో రాష్ట్రంలో బీఎస్పీ బలం పుంజుకుంటుందనే చర్చ సాగుతోంది. బీఎస్పీతో కలిసి ఎంఐఎం పోటీ చేయవచ్చనే చర్చ సాగుతోంది. గతంలోనే ఎంపీ అసద్ జై భీమ్... జై మీమ్ నినాదం ఇచ్చారు. మహారాష్ట్రలో ఈ నినాదంతోనే ప్రకాశ్ అంబేద్కర్ తో కలిసి పోటీ చేశారు. తెలంగాణలోనూ అదే ప్రయత్నంలో అసద్ ఉన్నారని అంటున్నారు. దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలతో కాంగ్రెస్ తోనూ అసద్ కలిసిపోయే అవకాశం ఉందని అంటున్నారు.

పాతబస్తీతో పాటు మైనార్టీల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేస్తే అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తప్పదని అంటున్నారు. గత ఎన్నికల్లో మైనార్టీల ఓట్లు గంపగుత్తగా కారుకు పడ్డాయి. ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ సీన్ మారింది. కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా రేసులోకి వచ్చింది. బీఎస్పీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. బహుముఖ పోటీ జరగనుండటంతో గెలుపు మార్జిన్లు స్వల్పంగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులో ఇంత కాలం తమకు మద్దతుగా ఉన్న మైనార్టీ ఓట్లు చీలితే కారుకు గండం భారీగా జరగనుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు అసద్ ఆలోచన మాత్రం మరోలా ఉందట. బహుముఖ పోటీలో 40 వేల ఓట్లు వచ్చినా గెలిచే పరిస్థితి ఉంటుంది. ఈ లెక్కన మైనార్టీ ఓట్లను గంపగుత్తగా సాధిస్తే కొన్ని సీట్లు గెలవచ్చనే అంచనాలో అసద్ ఉన్నారంటున్నారు. మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉన్నందున డబుల్ డిజిల్ సీట్లు గెలిస్తే.. ప్రభుత్వ ఏర్పాటులో తామే కింగ్ మేకర్లం అవుతామనే భావనలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఉన్నారని తెలుస్తోంది. మొత్తంగా పాతబస్తీ బయట ఎంఐఎం పోటీ చేస్తే మాత్రం సీఎం కేసీఆర్ కు పరేషాన్ తప్పదనే టాక్ వస్తోంది.

Also Read:TRS VS MIM: పీకే బాటలోనే ఎంఐఎం.. కేసీఆర్ తో దోస్తీ కటీఫ్! 30 నియోజకవర్గాల్లో కారుకు గండం..

Also Read:  Telangana Rain Alert : తెలంగాణలో మరో వారం కుండపోతే.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News