Samantha Ruth Prabhu : సమంత గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో చడీ చప్పుడు లేకుండా సైలెంట్ అయిపోయింది. తన మీద ఎన్ని రూమర్లు వచ్చినా స్పందించలేదు. తనకు ఏదో రోగం వచ్చిందని, చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతోందంటూ ఇలా రకరకాల గాసిప్స్ వచ్చాయి. కానీ సమంత మాత్రం నేరుగా స్పందించలేదు. తన మేనేజర్‌తో ఓ ప్రకటనను ఇప్పించింది. అవన్నీ అవాస్తవాలని, వాటిని ప్రచారం చేసే వారి మీద చర్యలు తీసుకుంటామని సమంత మేనేజర్ హెచ్చరించాడు.
అయితే సమంత మాత్రం సోషల్ మీడియాలో ఇలా ఒక్కసారిగా సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటన్నది తెలియడం లేదు. మామూలుగా అయితే రోజుకు ఏదో ఒక పోస్ట్ వేస్తూనే ఉంటుంది. అలాంటి సమంత గత మూడు నాలుగు నెలలుగా నార్మల్ పోస్ట్ కూడా వేయలేదు. తన సినిమా అప్డేట్ల విషయాలు మాత్రమే పోస్ట్ వేసింది. శాకుంతలం, యశోదలకు సంబంధించిన అప్డేట్లు మాత్రమే షేర్ చేసింది.
పర్సనల్ లైఫ్ విషయాలను మాత్రం సమంత షేర్ చేసుకోవడం లేదు. ఏదో ఒక పోస్ట్ వేయడం, తన పర్సనల్ విషయాలు షేర్ చేయడం, కొటేషన్లను చెప్పడం సమంతకు అలవాటు. కానీ సమంత మాత్రం గత కొన్ని నెలలుగా సైలెంట్‌గానే ఉంటోంది. కానీ ఇప్పుడు మళ్లీ సమంత తన పాత పద్దతిలోకి వచ్చినట్టు కనిపిస్తోంది.
సమంత తాజాగా తన పెట్ ఫోటోను షేర్ చేసింది. సమంత ఇంట్లో హష్, సాషా అనే రెండు పెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. హష్ ఎప్పటి నుంచో సమంత వద్దే ఉంటోంది. సాషా ఈ మధ్యే వచ్చింది. అయితే సాషా మొహాన్ని మాత్రం చూపించలేదు సమంత. డౌన్ నాట్ అవుట్ అని పోస్ట్ వేసింది. వెనక్కి తగ్గాను.. ఓడిపోలేదు అన్నట్టుగా సమంత పోస్ట్ వేయడంతో.. సెలెబ్రిటీలు, ఆమె ఫ్యాన్స్ కామెంట్లతో పోస్ట్‌ను వైరల్ చేస్తున్నారు. బీ స్ట్రాంగ్ అంటూ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. అయితే తన మీద ఇన్నాళ్లుగా వచ్చిన ట్రోల్స్, చేసిన ట్రోలర్లకు కౌంటర్లు వేసినట్టుగా అనిపిస్తోంది.
Also Read : Chiranjeevi Pothuraju Steps: పోతురాజు స్టెప్పులేసిన చిరంజీవి.. వీడియో వైరల్
Also Read : Rahul Ramakrishna Wife : సీక్రెట్‌గా పెళ్లి.. రాహుల్ రామకృష్ణ భార్య పిక్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Samantha Ruth Prabhu : వెనక్కి తగ్గా ఓడిపోలేదు.. సమంత పోస్ట్
నెట్టింట్లో సైలెంట్ అయిన సమంత
చాలా రోజుల తరువాత సామ్ పోస్ట్
ట్రోలర్లకు కౌంటర్లు వేసిన సమంత?