Congress President Voting Ended, Results announce on October 19. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులలో పార్టీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
A milestone in the 137-year history of the Congress party has come to a happy end. Congress presidential election process ended peacefully. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులలో పార్టీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఓటు వేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్.. మధ్యాహ్నం 4 గంటలకు ముగిసింది. అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ ఇష్టపడకపోవడంతో.. 24 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి.