సెంట్రల్ బోర్డ్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ బోర్డు ఫలితాలను మంగళవారం, మే 29, 2018న సాయంత్రం 4 గంటలకు ప్రకటించనుంది. ఈ విషయాన్ని మానవ వనరుల మంత్రిత్వ శాఖ, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అనిల్ స్వరూప్ సోమవారం ఒక ట్వీట్‌లో ప్రకటించారు. బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్ www.cbse.nic.in, www.cbseresults.nic.inలలో విద్యార్ధుల ఫలితాలను తెలుసుకొవచ్చు.
విద్యార్థులు CBSE క్లాస్ 10 రిజల్ట్స్ అని గూగుల్‌లో సెర్చ్ చేసి.. సంబంధిత లింక్‌ల మీద క్లిక్ చేసి లాగిన్ అయి వివరాలను నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.
సీబీఎస్ఈ పదో తరగతి,12వ తరగతి పరీక్షలకు ఈ ఏడాది సుమారు 28 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 5 నుంచి ఏప్రిల్ 18 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు భారత దేశ వ్యాప్తంగా 4,453 కేంద్రాలు, 78 విదేశీ కేంద్రాలలో 16,38,420 మంది హాజరయ్యారు.
సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షా ఫలితాలు 2018:
నేడు సీబీఎస్ఈ 10th క్లాస్ ఫలితాలు