Papaya Seeds For Diabetes Cholesterol: బొప్పాయి పండు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అందుకే వైద్య నిపుణులు వీటిని తీసుకోవాలని సూచిస్తారు. అయితే ఇందులో ఉండే గింజలు కూడా శరీరానికి చాలా రకాలుగా ఉపయోపడుతుంది. అయితే ఈ గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే బొప్పాయి గింజలు తింటే మధుమేహం, కొలెస్ట్రాల్, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు సులభంగా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మందిలో గింజలు తినడం వల్ల దుష్ప్రభావాలు వస్తాయి. అయితే వీటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..
>>బొప్పాయి విత్తనాలలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అలాగే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె జబ్బులు సులభంగా దూరమవుతాయి. కాబట్టి గుండె సమస్యలతో బాధపడేవారు ఇలా చేయండి.
>>బొప్పాయి గింజల్లో ఉండే మూలకాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. ఈ గింజల్లో మోనోశాచురేటెడ్ కొవ్వులు అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
>>బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గడానికి కీలక పాత్ర పోషిస్తాయి. బొప్పాయి గింజలను రోజూ తినడం వల్ల సులభంగా శరీరంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
>>ప్రస్తుతం చాలా మందిలో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి బొప్పాయి గింజలను కూడా తినవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
>>చాలా మంది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు బొప్పాయి గింజలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మూత్రపిండాలకు ఆక్సీకరణ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
>>బొప్పాయి పండ్లను అతిగా తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చు. అయితే వీటిని గర్భిణీ స్త్రీలు, పురుషులు అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read : Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా కావాలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook