Actress Anjali Pavan : అమ్మ మాత్రమే.. నాన్న లేరు.. స్టేజ్ మీద ఏడిపించేసిన మొగలిరేకులు అంజలి పవన్

Actress Anjali Pavan బుల్లితెర నటి అంజలి పవన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మిస్టర్ అండ్ మిసెస్ షోలో అంజలి తన భర్త పవన్‌తో కలిసి సందడి చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2022, 09:30 AM IST
  • బుల్లితెరపై మిస్టర్ అండ్ మిసెస్ సందడి
  • అందరినీ ఏడిపించేసిన అంజలి పవన్
  • స్టేజ్ మీదే అందరి ముందు నటి ఎమోషనల్
Actress Anjali Pavan : అమ్మ మాత్రమే.. నాన్న లేరు.. స్టేజ్ మీద ఏడిపించేసిన మొగలిరేకులు అంజలి పవన్

Actress Anjali Pavan : బుల్లితెర నటీనటులకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై నిత్యం కనిపిస్తూ.. సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటూ మరింత క్రేజ్ పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మరో ఎంటర్టైన్మెంట్ షోను ప్రారంభించారు. మిస్టర్ అండ్ మిసెస్ అనే ఈ షోలో పది జంటలను తీసుకువచ్చారు. ఇందులో అంజలి పవన్ కూడా ఒక జంటగా ఆట ఆడుతోంది. ఈ షోకు అనిల్ రావిపూడి, స్నేహ, శివ బాలాజీ వంటి జడ్జ్‌లుగా వచ్చారు.

అయితే ఇప్పుడు ఈ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి వైరల్ అవుతోంది. అందులో అంజలి పవన్ చివర్లో అందరినీ ఏడిపించేసింది. మొగలి రేకులు సీరియల్‌తో నటి అంజలి పవన్‌కు మంచి క్రేజ్ వచ్చింది. అడపాదడపా చిత్రాలు, సీరియల్‌లు చేస్తూ మంచి ఇమేజ్ దక్కించుకుంది. అయితే ఈ మధ్య మాత్రం అంజలి పవన్ యూట్యూబ్ చానెల్ ద్వారా మరింతగా హాట్ టాపిక్ అవుతోంది.

నటి అంజలి  తన కూతురు ధన్వికతో, తన భర్త పవన్‌తో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఇన్ స్టాగ్రాంలో సందడి చేస్తుంటుంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ జంటగా మిస్టర్ అండ్ మిసెస్ షోలో పాల్గొన్నారు. అక్కడ అంజలి తన పర్సనల్ విషయాలను పంచుకుంది. అందరి ముందే ఎమోషనల్ అయింది. స్టేజ్ మీదే కంటతడి పెట్టేసుకుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News