Ginna Day 1 Collections : తెలుగు రాష్ట్రాల్లోనూ దారుణం.. 'ఓరి దేవుడా' అనుకునేలా 'జిన్నా'.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే

Ginna Day 1 Collections : మంచు విష్ణు జిన్నా చిత్రం మొదటి రోజు దారుణమైన స్థాయిలో కలెక్షన్లను రాబట్టేసింది. ఇంత తక్కువ మొత్తంలో కలెక్షన్లు సాధించడంతో అందరూ ట్రోల్స్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2022, 12:21 PM IST
  • ఒకే రోజు నాలుగు చిత్రాల సందడి
  • దారుణంగా జిన్నా మూవీ పరిస్థితి
  • విశ్వక్ సేన్‌ని కూడా టచ్ చేయని మంచు విష్ణు
Ginna Day 1 Collections : తెలుగు రాష్ట్రాల్లోనూ దారుణం.. 'ఓరి దేవుడా' అనుకునేలా 'జిన్నా'.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే

Ori Devuda Day 1 Collections Vs Ginna Day 1 Collections : ప్రతీ శుక్రవారం కొత్త సినిమాల సందడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ శుక్రవారం నాలుగు సినిమాలు బరిలోకి దిగాయి. నాలుగు సినిమాలపై అంతో ఇంతో బజ్ ఉంది. అందులో విశ్వక్ సేన్ ఓరి దేవుడా సినిమా తమిళ సినిమాకు రీమేక్. కార్తీ సర్దార్ తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయింది. జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్.. శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ సినిమాను బైలింగ్విల్‌గా తీశాడు.

ఇక మంచు విష్ణు సినిమా అయితే హిందీ, తెలుగు ఇలా భారీ ఎత్తునే రిలీజ్ అయింది. మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ వంటి వారు నటించడంతో మరింత బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. పర్వాలేదు.. ఒకసారి చూడొచ్చు అనే టాక్ వచ్చింది. కానీ సినిమాకు మాత్రం పూర్ కలెక్షన్లు వచ్చాయి. దారుణమైన ఓపెనింగ్స్‌ రావడంతో జనాలు ట్రోల్స్ చేస్తున్నారు.

ఓవర్సీస్‌లో జిన్నా పరిస్థితిని చూసి అందరూ నవ్వుతున్నట్టుగా అనిపిస్తోంది. జిన్నా సినిమాకు ఓవర్సీస్‌లో దారుణాతి దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. కనీసం విశ్వక్ సేన్ ఓరిదేవుడా సినిమాను కూడా టచ్ చేయలేకపోయింది. జిన్నాకు, ఓరి దేవుడా సినిమాకు వచ్చిన కలెక్షన్లలో తేడా.. భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉంది. ఓరి దేవుడా సినిమాకు దాదాపు ఎనిమిది వేల డాలర్లు వస్తే.. జిన్నాకు కనీసం ఐదువందల డాలర్లు కూడా వచ్చినట్టు కనిపించడం లేదట.

ఓవర్సీస్‌లో అలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి అంతే ఉందని తెలుస్తోంది. నిన్న విడుదలైన నాలుగు చిత్రాల్లో అత్యంత అల్ప కలెక్షన్లతో జిన్నా చివరి స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. మొదటి రోజు సర్దార్ కోటికిపైగా షేర్, ప్రిన్స్  95 లక్షల షేర్, ఓరి దేవుడా  91 లక్షల షేర్ సాధించినట్టు తెలుస్తోంది. ఇక జిన్నా అత్యంత దారుణమైన స్థితిలోకి వెళ్లినట్టు సమాచారాం. జిన్నా సినిమాకు మొదటి రోజు 8 లక్షల షేర్ వచ్చినట్టు సమాచారం అందుతోంది. మరి కొన్ని లెక్కల ప్రకారం జిన్నాకు మ్యాగ్జిమం పది నుంచి పన్నెండు లక్షలు మాత్రమే వచ్చి ఉంటాయని అంటున్నారు. ఇలా మొత్తానికి జిన్నాకు మాత్రం దారుణమైన పరాభవం ఎదురైనట్టుంది. జిన్నా లెక్కలు చూస్తే నిజంగానే ఓరి దేవుడా అనేట్టుగా కనిపిస్తోంది.

Also Read : Vishnu Manchu Ginna Collections : జిన్నా పరిస్థితి మరీ దారుణంగా.. 50 షోలకు 49 టికెట్లు తెగాయా?

Also Read : Kantara 7 Days collection : ఏడురోజులకు ఐదురెట్ల లాభాలు.. ఆగని కాంతారా కాసుల వర్షం

(గమనిక : ఈ సమాచారం వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించినది, వీటిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు.)
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News