Bhupesh Baghel: షాకింగ్ న్యూస్.. కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి

Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్‌లోదీపావళి వేడుకలు సంబురంగా జరిగాయి. ఏటా దీపావళి తర్వాతి రోజు  గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు.దుర్గ్‌ జిల్లాలోని జజంగిరి గ్రామంలో నిర్వహించిన గోవర్ధన్‌ పూజలో  ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ పాల్గొన్నారు

Written by - Srisailam | Last Updated : Oct 25, 2022, 02:58 PM IST
  • కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి
  • గోవర్ధన పూజలో ఆనవాయితీ
  • వైరల్ గా మారిన సీఎం వీడియో
Bhupesh Baghel: షాకింగ్ న్యూస్.. కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి

Bhupesh Baghel:  ఆయనో ముఖ్యమంత్రి... అయినా కొరడా దెబ్బలు తిన్నాడు. జనాలంత చూస్తుండగా ఓ వ్యక్తి ముఖ్యమంత్రి చేతిపై కొరడతా కొట్టాడు. ఒకటి కాదు రెండు రాదు.. ఆరేడు కొరడా దెబ్బలు తిన్నాడు ముఖ్యమంత్రి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. కొరడా దెబ్బలు తిన్నది ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్. సీఎం ఏంటీ కొరడా దెబ్బలు తినడం ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? .. అందుకు బలమైన కారణమే ఉంది. ఆచారంలో భాగంగా ఆయన కొరడా దెబ్బలు తిన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం దీపావళి వేడుకలు సంబురంగా జరిగాయి. ఏటా దీపావళి తర్వాతి రోజు  గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు. ఈసారి కూడా దీపావళి వేడుకల్లో భాగంగా రాష్ట్రమంతా మంగళవారం గోవర్ధన్‌ పూజ ఘనంగా నిర్వహించారు. దుర్గ్‌ జిల్లాలోని జజంగిరి గ్రామంలో నిర్వహించిన గోవర్ధన్‌ పూజలో  ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ పాల్గొన్నారు. ఆలయంలో గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత జరిగే తంతులో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తిన్నారు.

ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కొరడా దెబ్బలు తినడం ఆనవాయితీ. అలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే జజంగిరి టెంపుల్ కు వచ్చిన సీఎం భూపేష్ బాఘెల్.. అందరు భక్తుల్లానే కొరడా దెబ్బలు తిన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని.. అలా జరగాలనే తాను కొరడా దెబ్బలు తిన్నానని సీఎం బాఘెల్ చెప్పారు. తాను కొరడా దెబ్బలు తిన్న వీడియోను సీఎం తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

Also Read : Rishi Sunak: బుద్ది పోనిచ్చుకోని భారతీయులు... గూగుల్ ట్రెండింగ్ లో రిషి సునక్ క్యాస్ట్ సెర్చింగ్

Also Read : Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్‌ కుమార్‌ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News