Budh Gochar 2022: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. బుధుడు ఈనెల 26న తులరాశిలోకి ప్రవేశించాడు. వచ్చే నెల 13, రాత్రి రాత్రి 9.06 గంటల వరకు తులారాశిలోనే (Mercury transit in Libra 2022) ఉంటాడు. అనంతరం వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడి యెుక్క స్థానం మార్పు కారణంగా కొన్ని రాశులవారికి ధననష్టం వాటిల్లుతుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
బుధుడి సంచారం ఈ రాశులకు కష్టకాలం
తుల రాశి (Libra): బుధగ్రహ సంచారం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి. దీంతో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవల్సి రావచ్చు. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి ముందడుగు వేయండి.
మకర రాశి (Capricorn): బుధుడు రాశిమార్పు వల్ల వీరికి చర్మ సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం అంతగా కలిసిరాదు.
ధనస్సు రాశి (Sagittarius): మెర్య్కూరీ ట్రాన్సిట్ వల్ల వీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఈ సమయంలో పెట్టుబడులకు దూరంగా ఉండండి, లేకుంటే ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు.
వృశ్చిక రాశి (Scorpio): బుధుడి రాశిలో మార్పు వల్ల వీరు కొన్ని ఇబ్బందులకు గురికావచ్చు. ఖర్చులు పెరగడం వల్ల మీ ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులు తీవ్ర నష్టాలు చవిచూస్తారు.
మీన రాశి (Pisces): ఈరాశివారు భారీగా డబ్బు నష్టపోతారు. శత్రువుల పట్ల అప్రమత్తతో మెలగండి. మీ అనారోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది, కాబట్టి హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండండి.
Also read: Budh Gochar 2022: నవంబర్ 13 వరకు ఈ 5 రాశులపై బుధుడి అనుగ్రహం.. ఇందులో మీ రాశి కూడా ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook