Pelli Fame Prudhvi Marriage : పెళ్లి సినిమాతో విలన్‌గా పరిచయమైన పృథ్వీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే పృథ్వీ ఎంత మంచి నటుడైనా కూడా మధ్యలో ఆఫర్లు ఆగిపోయాయి. తన పర్సనల్ లైఫ్‌లోని సమస్యలతో సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. తాను చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా అందులో తన మార్క్ చూపించేశాడు. ఇప్పుడు బుల్లితెరపైకి వచ్చాడు. కొన్ని రోజులు సీరియల్స్‌లో నటించాడు. అప్పుడప్పుడు కొన్ని చిత్రాలు కూడా చేస్తున్నాడు.
అయితే తాజాగా తన పెళ్లి విషయాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. యాభై ఆరేళ్ల తాను ఇరవై నాలుగేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రేమకు వయసు లేదని, ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేమని, ముందు తనను బాగా ఆలోచించుకోమని చెప్పాడట. చివరకు ఆమె పెళ్లి చేసుకుందామని అనేసిందట. వాళ్లింట్లోనూ ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదని చెప్పుకొచ్చాడు.
I want it everyday 😊☺️ pic.twitter.com/B91AoyMAzY
— பூமர் (@poochaanD) October 29, 2022
ఈ మేరకు పృథ్వీ తన ప్రియురాలితో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆమె తెలుగమ్మాయే. అయితే తమిళంలో ఇంటర్వ్యూ ఇచ్చాడు పృథ్వీ. ఈ క్రమంలో ఓ వింత ప్రశ్న ఎదురైంది. మీరు ఇప్పుడు కూడా పడక సుఖం కోరుకుంటున్నారా? అని అడిగింది. దీనికి అవును అని సమాధానం ఇచ్చాడు. అయితే ఆ అమ్మాయికి మాత్రం అర్థం కాలేదు. ఏం అంటోంది అని అడిగితే.. ఇంటికి వెళ్లాక వివరిస్తానులే అని పృథ్వీ అంటాడు. అనంతరం ఇంటర్వ్యూ చేస్తోన్న వ్యక్తి వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. నాకు ప్రతీ రోజు కావాలంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
మొత్తానికి పృథ్వీ చేసిన ఈ నాటీ కామెంట్స్ మాత్రం జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. నెటిజన్లు ఈ కామెంట్లు విని తెగ నవ్వేసుకుంటున్నారు. పృథ్వీ పెళ్లి త్వరలోనే జరగబోతోందని తెలుస్తోంది. అయితే పృథ్వీకి 27 ఏళ్ల వయసున్న కొడుకు ఉండటం గమనార్హం.
Also Read : Bigg Boss Shrihan : విన్నర్ అయ్యే అర్హత లేనిది అందుకే.. బొక్క బోర్లా పడ్డ శ్రీహాన్.. ఇక కష్టమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook