Poonam Kaur - Bharat Jodo Yatra : పూనమ్ కౌర్ చేతిని పట్టుకున్న రాహుల్ గాంధీ.. ఆ మాటతో అడ్డంగా బుక్కైన హీరోయిన్

Poonam Kaur Hand in Bharat Jodo Yatra రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో ఎంట్రీ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పూనమ్ కౌర్ వచ్చింది. రాహుల్ గాంధీతో పాటుగా నడిచింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2022, 07:07 AM IST
  • తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర
  • రాహుల్ గాంధీ వెంట నడిచిన పూనమ్
  • చేయి పట్టుకున్న ఫోటోపై నెటిజన్ల ట్రోల్స్
Poonam Kaur - Bharat Jodo Yatra : పూనమ్ కౌర్ చేతిని పట్టుకున్న రాహుల్ గాంధీ.. ఆ మాటతో అడ్డంగా బుక్కైన హీరోయిన్

Poonam Kaur Hand in Bharat Jodo Yatra : పూనమ్ కౌర్‌కు రాజకీయాలంటే బాగానే ఇష్టమున్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య బీజేపీతో కలిసి తిరిగినట్టు అనిపించింది. ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంది. రాహుల్ గాంధీతో పాటుగా నడిచింది. పరిగెత్తింది. నానా హంగామా చేసేసింది. అయితే ఇప్పుడు ఈ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పూనమ్ కౌర్ ఫోటోల మీద చర్చ జరుగుతోంది. పూనమ్ కౌర్ చేతిని పట్టుకుని రాహుల్ గాంధీ నడవడం మీద ట్రోలింగ్ జరుగుతోంది.

 

ఓ బీజేపీ కార్యకర్త ఇలా పోస్ట్ వేసింది. తాతగారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు.. అంటూ పగలబడి నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు. ఇక దీనిపై పూనమ్ రియాక్ట్ అయింది. ఇది నిన్ను నువ్వే తక్కువగా చేసుకుంటున్నట్టుగా ఉంది.. మన ప్రధానీ నారీ శక్తి గురించి చెబుతుంటారు కదా?.. నేను స్లిప్ అయి కింద పడిపోబోతోంటే.. ఆయన నన్ను పట్టుకున్నారు అంటూ పూనమ్ కౌర్ అనేసింది. అయితే స్లిప్ అయ్యాను.. అందుకే పట్టుకున్నాడు అనే మాటను నెటిజన్లు బాగా టార్గెట్ చేశారు.

 

ఏది నువ్ ఇలా స్లిప్ అయ్యావా? ఎక్కడ స్లిప్ అయ్యావ్.. నేను రెండు సార్లు వీడియోను చూశా.. కానీ నువ్ ఎక్కడా కూడా స్లిప్ అయినట్టుగా నాకు కనిపించడం లేదు అంటూ ఇలా నానా రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి పూనమ్ మాత్రం ఇలా రిప్లై ఇచ్చి లేని పోని వివాదాన్ని మరింతగా పైకి లేపినట్టు అయింది.

 

అసలే పూనమ్ కౌర్‌ ఎక్కువగా కాంట్రవర్సీలతోనే ఫేమస్ అవుతుంటుంది. పవన్ కళ్యాణ్‌, త్రివిక్రమ్ వంటి వారి విషయాల్లోనే పూనమ్ కౌర్ ఎక్కువగా హైలెట్ అవుతుంటుంది. అప్పుడప్పుడు ఆమె వేసే నిగూఢ ట్వీట్లు సైతం ప్రకంపనలకు దారి తీస్తుంటాయి. ఒక్కోసారి పవన్ కళ్యాణ్‌ను తిట్టినట్టు ఉంటాయ్.. కొన్ని సార్లు పొగిడినట్టుంటాయి. ఇక గురూజీ అంటూ ఆమె వేసిన ట్వీట్లు అప్పట్లో ఎంతటి సంచలనంగా మారాయో అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు తనని తాను కవర్ చేసుకునేందుకు వేసిన ఈ ట్వీట్ ఇంకెత రచ్చకు దారి తీస్తుందో చూడాలి.

Also Read : Ram Charan Cooking : వెకేషన్లో వంటా వార్పు.. రామ్ చరణ్ వీడియో

Also Read : శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు.. క్షమించండి అంటూ బండ్ల గణేష్ ట్వీట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x