Anudeep's demand Stable after a disaster: సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఎలాంటి దర్శకుడికైనా అవకాశాలు తగ్గుతూ ఉంటాయి కానీ జాతి రత్నాలు సినిమాతో హిట్ అందుకుని ప్రిన్స్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న అనుదీప్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. నిజానికి అనుదీప్ పిట్టగోడ అనే ఒక సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ పిట్టగోడ అనే సినిమా వచ్చిన సంగతి కూడా చాలా మందికి తెలియదు.
అయితే ఎలా ఒప్పించారో తెలియదు కానీ నాగాశ్విన్ కు జాతి రత్నాలు కథ చెప్పి ఒప్పించడమే గాక వారి సొంత ప్రొడక్షన్ హౌస్ తో దాన్ని నిర్మింప చేశారు అనుదీప్. అలా నవీన్ పోలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో ఫారియా అబ్దుల్లా హీరోయిన్గా రూపొందించిన జాతి రత్నాలు సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాక కరోనా కాలంలో కూడా కాసుల వర్షం కురిపించింది, ఈ దెబ్బతో ఆయనకు ఏకంగా తమిళ స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది.
అలా ఆయన శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ అనే సినిమాను రూపొందించారు. ఏకంగా ఉక్రెయిన్ హీరోయిన్ ను దింపి సినిమాను మరో లెవల్ కు తీసుకువెళ్లారు. వాస్తవానికి ఈ సినిమాని తెలుగులో రూపొందించి తమిళ్ లో డబ్బింగ్ చేస్తారని అనుకున్నారు కానీ దానికి విరుద్ధంగా తమిళంలో రూపొందించి తెలుగులో డబ్బింగ్ చేశారు. ఈ దెబ్బతో ఒకటి రెండు తప్ప తెలుగులో తెలిసిన ముఖాలే కరువయ్యాయి. అలా ఈ సినిమా మీద తెలుగువారికి కనెక్టివిటీ తగ్గిపోవడంతో సినిమా మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు.
అలా అని తమిళ ఆడియన్స్ ఈ సినిమా మీద ఆసక్తి చూపించారా అంటే అదీ లేదు. ఎందుకో వాళ్లు కూడా సినిమాకి కనెక్ట్ అవ్వలేకపోయారు. దీంతో ఇక అనుదీప్ పని అయిపోయిందని అందరూ భావించారు. కానీ అది వాస్తవం కాదని తెలుస్తోంది. అసలు అనుదీప్ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని ఇప్పటికి కూడా కుర్ర హీరోలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే అనుదీప్ కొంతమంది ప్రొడ్యూసర్ల దగ్గర అడ్వాన్సులు కూడా తీసుకున్నాడని అందులో భాగంగానే ఆయన హీరో రామ్ కి ఒక కథ నేరేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. రామ్ కూడా అనుదీప్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని అంటున్నారు. కథ నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రామ్ ప్రస్తుతానికి బోయపాటి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తరువాత ప్రాజెక్ట్ అనుదీప్ తో సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు.
Also Read: Movies Releasing on November 4th: థియేటర్లలోకి ఏకంగా 8 సినిమాలు.. ఏమేం సినిమాలో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
Anudeep's demand : మార్కెట్లో అతని క్రేజ్ చూస్తే మెంటలే.. మామూలు జాతి రత్నం కాదుగా!