/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Rohit Sharma Fan entered melbourne ground for hug in T20 World Cup 2022: క్రికెటర్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారత ప్లేయర్లకు అందరికంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఎక్కువ మంది ఫాన్స్ ఉంటారు. తమ అభిమాన క్రికెటర్ ఆట చూసేందుకు కొందరు ఫాన్స్ మైదానానికి వెళ్తారు. మరొకొందరు డై హార్డ్ ఫాన్స్ మాత్రం తమ అభిమాన క్రికెటర్‌ని కలవడానికి బారికేడ్లను కూడా దూకేస్తుంటారు. ఇలాంటి ఘటనే మరోసారి చోటుచేసుకుంది. 

టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా ఆదివారం భారత్, జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వీరాభిమాని బారికేడ్లను దాటి మైదానంలోకి దూసుకొచ్చాడు. జింబాబ్వే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక టీనేజ్‌ కుర్రాడు సెక్యూరిటీ కళ్లు కప్పి.. ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి హత్తుకునే ప్రయత్నం చేశాడు. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అతడు కింద కూడా పడ్డాడు. సెక్యూరిటీ బయటికి తీసుకెళుతుంటే.. రోహిత్ పక్కనే ఉన్నాడు. ఒక్క షేక్ హ్యాండ్.. కనీసం హగ్‌ కావాలి అన్నట్టుగా రోహిత్ వైపు ఆ అభిమాని చూశాడు. అంతేకాదు బయటికి తీసుకెళుతుంటే.. కన్నీళ్లు పెట్టుకున్నాడు.

రోహిత్‌ శర్మ వద్దకు దూసుకొచ్చిన అభిమానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ వైపు చూస్తూ.. అతడు కన్నీళ్లు పెట్టుకోవడం అందరి హృదయాలను పిండేస్తుంది. ఏదేమైనా అనుమతి లేకుండా మైదానంలోకి రావడం పెద్ద తప్పుగా పరిగణిస్తారు. తమ భద్రత దృశ్యా ఆటగాళ్లు కూడా తన డై హార్డ్ ఫాన్స్‌ను కూడా దగ్గరికి రానియ్యరు. రోహిత్ కూడా ఈ రూల్ పాటించాడు. ఇదివరకు రోహిత్ తన అభిమానులకు షేక్ హ్యాండ్ ఇచ్చి పంపిన ఘటనలు ఉన్నాయి. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు కూడా తమ అభిమానులను ఏమనొద్దని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. 

ఇక సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించి మైదానంలోకి దూసుకొచ్చిన ఆ యువకుడికి క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) రూ.6 లక్షల 50 వేల భారీ జరిమానా విధించింది. ఫాన్స్ మరోసారి ఇలా మైదానంలోకి దూసుకురాకుండా ఈ జరిమానా విధించామని సీఏ అంటోంది. ఈ ప్రపంచకప్‌లో అభిమానులు గ్రౌండ్‌లోకి రావడం ఇది రెండోసారి. దీంతో ఆటగాళ్ల భద్రతపై క్రికెట్‌ ఆస్ట్రేలియా తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: Bigg Boss Geetu Elimination : ఎంత ఏడ్చినా ఏమీ లాభం.. చివరకు గీ'థూ' అనిపించుకుంది.. ఇదే గుణపాఠం

Also Read: Munugode Results: టీఆర్ఎస్ మెజార్టీ తగ్గడానికి కారణమిదే.. ఆ రెండు గుర్తులతో తారుమారు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Section: 
English Title: 
Rohit Sharma Fan entered melbourne ground for hug in T20 World Cup 2022, Cricket Australia fined him 6.5 Lakhs INR
News Source: 
Home Title: 

రోహిత్ భాయ్.. ఒకే ఒక్క హగ్‌ అంటూ ఫ్యాన్ కన్నీటిపర్యంతం! గుండెలు పిండేసే వీడియో

Rohit Sharma Fan: రోహిత్ భాయ్.. ఒకే ఒక్క హగ్‌ అంటూ ఫ్యాన్ కన్నీటిపర్యంతం! గుండెలు పిండేసే వీడియో
Caption: 
Source: Twitter
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

రోహిత్ భాయ్.. ఒకే ఒక్క హగ్‌

రోహిత్ ఫ్యాన్ కన్నీటిపర్యంతం

గుండెలు పిండేసే వీడియో

Mobile Title: 
రోహిత్ భాయ్.. ఒకే ఒక్క హగ్‌ అంటూ ఫ్యాన్ కన్నీటిపర్యంతం! గుండెలు పిండేసే వీడియో
P Sampath Kumar
Publish Later: 
No
Publish At: 
Monday, November 7, 2022 - 12:15
Request Count: 
79
Is Breaking News: 
No